Home / Entertainment / మరో అందమైన మూవీని అందించడానికి రెడీ అవుతున్న శ్రీనివాస్ అవసరాల.

మరో అందమైన మూవీని అందించడానికి రెడీ అవుతున్న శ్రీనివాస్ అవసరాల.

Author:

‘అష్టాచమ్మా’ సినిమాతో పరిచయం అయిన శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా మొదటి ప్రయత్నంగా ‘ఊహలు గుసగుసలాడే’ లాంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీతో అందరిని మెప్పించాడు. ఇప్పుడు రెండవ ప్రయత్నంగా నారా రోహిత్ ని అలాగే తన మొదటి సినిమా హీరో అయినా నాగశౌర్యను ఇద్దరినీ కలిపి మల్టి స్టారర్ సినిమా గా ” జ్యో అచ్చుతానంద” అంటూ మన ముందుకు వస్తున్నాడు. రెజీనా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర ఆడియోని ఆగస్టు 21 న విడుదల చేయనున్నారు. జ్యోతి, అచ్యుతరావు, ఆనందరావు అనే ముగ్గురు వ్యక్తుల మధ్య కథ అంటూ దర్శకుడు ముందు నుండే చెప్పుకుంటూ వస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల మొదటి సినిమా నిర్మించిన వారాహి చలన చిత్ర సంస్థ తన రెండవ చిత్రాన్నికూడ నిర్మిస్తుండటం విశేషం.

ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు.. జ్యోతి, అచ్యుతరామారావు, ఆనంద వర్ధనరావు అనే మూడు పాత్ర ల పేర్లు వచ్చే విధంగా సినిమా టైటిల్‌ ఎంపిక చేయడం చాలా కొత్తగా ఉంది. ఈ ట్రైలర్ ని బట్టి చుస్తే ఇద్దరు అన్నదమ్ములతో ఓ అమ్మాయికి రిలేషన్ ఎలా ఉండబోతోందనే అనేదే ఈ సినిమా. ఈ టీజర్ ..నాగశౌర్య, నారా రోహిత్ మధ్య పోటీగా సాగింది.

(Visited 46 times, 1 visits today)