Home / Inspiring Stories / మన దేశంలో దొంగ స్వాములు ఎక్కవగా పుట్టుకు రావడానికి కారణాలు ఏమిటో తెలుసా !

మన దేశంలో దొంగ స్వాములు ఎక్కవగా పుట్టుకు రావడానికి కారణాలు ఏమిటో తెలుసా !

Author:

మన దేశంలో ఎంతమంది బాబులు ఉన్నారు అందులో కొందరు ప్రజల మంచి కొరకు పాటుపడేవారు అయితే కొందరు ప్రజలను బురిడీలు కొట్టించి పబ్బం గడుపుకునేవారు కొందరు. మరి ఇంత పుణ్య దేశంలో దేవుళ్ళు ఉండగా బాబాలకు ఇంత డిమాండ్ ఎందుకు వచ్చింది!?.

baba

పూర్వం రోజుల్లో గ్రామాలలో గాని పట్టణాలలో గాని పక్కవారికి ఎలాంటి అపాయం వచ్చిన చుట్టుపక్కల వారు అందరూ వచ్చి తలా ఒక చేయివేసి ఆదుకునేవారు, కానీ ఈ రోజులలో తమ ఇంట్లో వారికి ఏమి జరుగుతుందో తెలుసుకోలేనంత బిసి అయిపోయారు చాలా మంది. అలాగే బిజీ లైఫ్ లో ప్రశాంతత అనేది లేకుండాపోయింది దానితో మనసుకు ప్రశాంతత అనేది లేనప్పుడు మనం ఏదైతే జరుగుతుంది అనుకుంటామో అది జరుగదు. వెనుకటి రోజుల్లో మనసు ప్రశాంతత లేని సమయంలో గుడికి వెళ్లి అక్కడ కొద్ధి సమయం గడిపి గుడిలో ఉండే దేవుడికి తన సమస్యను చెప్పుకునేవారు ఆ సమయంలో గుడిలో ఉండే పూజారి అయినా ఆ సమస్యల లోటు తన మంచి మాటలతో కొంత వరకు తీర్చేవారు. కానీ ఇప్పుడు దేవాలయాలే ఆక్రమణలకు గురవుతున్నవి అలాంటి సమయంలో ఏ గుడి దగ్గరో బడి దగ్గరో దొంగ వేశాలు వేసుకొని మేము బాబాలం అంటూ వచ్చి, సమస్యలు ఉన్నవారికి వారి సమస్య తీరాలంటే యజ్ఞాలు, హోమాలు చేయాలంటూ వారి దగ్గరి నుండి డబ్బులు గుంజుతున్నారు..

దొంగ బాబులు ఎవరు ? మంచి బాబాలు ఎవరు !?

  • కొందరు బాబాలు మన వేదాలు,ఉపనిషత్తులు,అన్ని రకాల గ్రంధాలను చదివి అర్ధం చేసుకొని మంచి ఏమిటి చెడు ఏమిటి అని వివరంగా బోధిస్తారు. కానీ కొందరు ఇలాంటి విషయాలకు వారి గారడీ విద్యను జోడించి వారికి మహిమలు ఉన్నట్టు చెప్పుకొని చలామణి అవుతున్నారు.
  • కొంత మంది సిద్దులకోసం ప్రయత్నం చేస్తారు. వీరు కొండల్లో,గుహల్లో,శ్మశానాలాలో, సన్యాసుల, బైరాగుల దగ్గర కొన్ని రోజులు తిరిగి ఏవైనా కొన్ని మాయలు, మంత్రాలు నేర్చుకొని వాటిని బతుకుదెరువు కోసం ఉపయోగిస్తారు.
  • ఇప్పుడు చాలా మంది యోగ,ధ్యానం, ఫిలాసఫి అంటూ వాటికి మన పూర్వకాలంలో ఉన్న కొన్ని విషయాలను జోడించి మనిషికి ఏవిధంగా ఉపయోగపడతాయో తెలియజేస్తున్నారు. ఇలాంటి విధానం వలన మనకు మంచే జరుగుతుంది.

వీరికి అంత ప్రజాదరణ ఎక్కడి నుండి వస్తుంది :

మరి వీళ్ళ దగ్గరికి ఎక్కువగా ప్రజలు పోవడానికి కారణం వారి కోరికలు ఎక్కువ కావడమే. సంపాదన తక్కువై కోరికలు ఎక్కువైనప్పుడు మనకు కనిపించే సులువైన మార్గం దేవుడు లేదా మేమె దేవుళ్ళం అనే చెప్పుకునే బాబాలు. చిన్న,చిన్న కోరికలకు వారు బాబాల దగ్గరికి వెళ్లి వారి కోరికలను చెప్పుకుంటారు అందులో ఎక్కువగా వారి పిల్లలకు మంచి ఉద్యోగం దొరలకని, అప్పులు తీరాలని, వ్యాపారం బాగా జరగాలని, పిల్లలు పుట్టాలని, వారి పిల్లలకు మంచి సంబంధాలు దొరలకలని చెప్పుకుంటారు. ఇందులోచాలా వరకు బాబాలతో సంబంధం లేకుండా వారి కోరికలు తీరుతాయి కానీ బాబా దగ్గరికి వెళ్లి వచ్చిన తరువాతే మాకు మంచి జరిగిందని వారు పది మందికి చెబుతారు మన దేశంలో చాలా మంది ప్రజలు వారికి తోచిన పని చేయడం కంటే పక్కవారు చెప్పింది చేసేవారే ఎక్కువ. దానితో ఫ్రీగా బాబాలకు భాక్తులు ఎక్కువ అవుతారు.

కొందరికి ఎన్ని రోజులు తిరిగిన వారి కోరికలు తిరవు అలాంటి వారు మా అదృష్టం బాగాలేకపోతే బాబులు ఏమి చేస్తారు అనుకుంటారు కానీ బాబాలు మంచి వారు కాదు అని ఎక్కడ చెప్పారు. దానితో బాబాలకు మన దేశంలో తిరుగులేకుండా అయిపోయింది. కొందరి బాబాలకు రాజాకీయ పలుకుబడి, ప్రఖ్యాత ఆటగాళ్ల పరిచయాలు పెరిగి తక్కువ సమయంలోనే పేరుప్రఖ్యాతలు సంపాదించుకొని కోట్లు వెనకేసుకుంటారు.

(Visited 1,507 times, 1 visits today)