Home / Political / సెప్టెంబర్ 17 న తెలంగాణలో ఏమి జరిగిందంటే…!

సెప్టెంబర్ 17 న తెలంగాణలో ఏమి జరిగిందంటే…!

Author:

సెప్టెంబర్ 17 రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. చాలా రోజుల నుండి రాజకీయ పార్టీలు ఈ రోజుని గుర్తు చేస్తూ చాలా దుమారమే చేస్తున్నాయి. అందులో ఒక్కో రాజకీయ పార్టీది ఒక్కో వాదన . కమలనాథులేమో విమోచన దినం అని..కమ్యూనిస్టులేమో విలీన దినం.. ఇక మజ్లిస్‌ పార్టీ దృష్టిలో విద్రోహదినం. ఇన్ని విధాలుగా చెప్పుకుంటున్న ఈ రోజున అసలు ఏమి జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం :

telangana-vimochana-dinotsavam

1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారత దేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. దానికి కారణం హైదరాబాద్ నవాబ్ అసఫ్ జాహి వంశస్తుడైన 7వ నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ ని సొంత దేశంగా ప్రకటించుకున్నాడు. అంటే హైదరాబాద్ ఇటు ఇండియాలో కానీ అటు పాకిస్తాన్ లో కానీ కలువకుండా సొంత దేశంగా ఉంటుందని అలీఖాన్ ప్రకటన చేసాడు.

దీనితో నిజాంకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ వారు అలాగే ఆర్య సమాజ్ వారు పోరాటాలు చేశారు. కొత్తగా ఏర్పడిన దేశం అందులో దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సొంత దేశంగా ఉండటం ఏమిటి ? అనేది అప్పటి హోం మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నిర్ణయించారు. ఈ పని కోసం ఒక ఆపరేషన్ ని ఏర్పాటు చేసాడు.దాని పేరే పోలో. పోలో అనేది ఆ సమయంలో హైదరాబాద్ లో ఆట.

1948 సెప్టెంబర్ 13 న హైదరాబాద్ పై భారత సైన్యం పోలో ఆపరేషన్ పేరిట యుద్దం మొదలు పెట్టింది. హైదరాబాద్ నలు వైపులా నుండి తెలంగాణ ను అధీనంలోకి తీసుకోవడం మొదలు పెట్టారు. మొదటగా మాహారాష్ట్ర పైపు నుండి హైదరాబాద్ వైపు అన్ని గ్రామాలను తమ ఆధీనంలోకి తీసుకుంటూ వచ్చారు. దీనికి నల్ దుర్గ్ అనే సైన్యాధికారి నాయకత్వం వహించాడు. సెప్టెంబర్ 14 వ తేదీన ఔరంగాబాద్, జాల్నా, నిర్మల్, వరంగల్, సూర్యాపేటను ఆధీనంలోకి తీసుకోని హైదరాబాద్ వైపు వచ్చారు.

తుల్జాపూర్, తల్ముమడి నుండి వచ్చే సైన్యానికి జనరల్ డిఎస్ బ్రార్ నాయకత్వం వహించాడు. అలాగే మద్రాస్ వైపు నుండి వస్తున్నా సైన్యానికి ఎ.ఎ. రుద్ర. కర్ణాటక నుండి వచ్చే సైన్యానికి బ్రిగేడియర్ శివదత్తలు నాయకత్వం వహించారు. హైదరాబాద్ అన్ని వైపులనుండి భారత సైన్యం ఒక్కొక గ్రామాన్ని ఆధీనంలోకి తీసుకుంటూ వస్తుంటే అన్ని గ్రామాల ప్రజలు ఆర్మీకి స్వాగతాలు పలికారు. భారత సైన్యానికి భయపడి రజాకార్లు, నిజాం సైన్యం బెదిరిపోయింది. దానితో సెప్టెంబర్ 15 వ తేదీ నాటికి దక్కన్ రాజ్యం లోకి రావడానికి భారత సైన్యానికి ఎక్కువ సమయం పట్టలేదు. మూడు రోజుల్లోనే దక్కన్ భాగాన్ని పూర్తిగా భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది.

16 వ తేదీ మధ్యాహ్నం సమయానికి భారత సైన్యం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మోహరించింది. భారత సైన్యం చేసే యుద్దనికి బయపడి నిజాం మిలట్రీ చీఫ్ ఎల్ ఇద్రూస్ లొంగిపోయాడు. సెప్టెంబర్ 17 వ తేదీన సాయంత్రం సుమారు 5 గంటల సమయాని కల్లా ఆర్మీ హైదరాబాద్ ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది.అదే రోజు సాయంత్ర ప్రాంతంలో రేడియోలో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు ప్రకటన చేసాడు. దానితో భారత సైన్యం చేపట్టిన పోలో ఆపరేషన్ పూర్తిగా విజయవంతం కావడంతో హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ వరకు ఆర్మీ కవాతు చేసుకుంటూ విజయానందం కొనసాగించారు. ఈ విషయం తెలిసిన ప్రజలు రోడ్ల పైకి వచ్చి వారి ఆనందాన్ని పండగలా జరుపుకున్నారు. దానితో నిజం పాలనకు అంతం అయింది, తెలంగాణ భారతదేశంలో భాగం అయ్యింది, చరిత్రను గుర్తిస్తూ ఈ రోజున అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.

(Visited 957 times, 1 visits today)