Home / Inspiring Stories / చెన్నైలో ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ దుస్థితి.

చెన్నైలో ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ దుస్థితి.

Author:

Chennai Flood Victim

 

నేను అమెరికాకు చెందిన ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ చెన్నై విభాగంలో విధులు నిర్వహిస్తున్నాను. ఏడాదికి 18 లక్షల వార్షిక వేతనం పొందే నేను.. త్రిబుల్ బెడ్ రూం ఇంటికి ఓనర్నని గర్వంగా భావిస్తుంటాను. నాకు రెండు క్రెడిట్ కార్డులున్నాయి. వాటిలో లక్ష రూపాయలకు పైగా క్రెడిట్ లిమిట్ ఉంది. అలాగే నా అకౌంట్లో 65 వేల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది.

నిన్నటి వరకు నాకు రాబోయే 15 శాతం శాలరీ హైక్ గురించి ఆలోచించాను. అయితే ప్రస్తుతం నేను సహాయక బలగాలు విసిరే ఆహార పొట్లం కోసం ఆతృతగా టెర్రస్పై ఎదురు చూస్తున్నాను“. ఇదీ  చెన్నైకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజినీర్ పరిస్థితి. కాగా వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న చెన్నై వాసులు తమ ఇళ్ల నుండి బయటకు రాలేక గుక్కెడు మంచినీళ్లు, పిడికెడు మెతుకుల కోసం దీనంగా  వీధుల్లో నిలబడి ఎదురు చూస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న బాధితులు ఆహార పొట్లాల కోసం  ఆతృతగా ఎదురు చూస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆహార పొట్లాల కోసం జనాలు ఎగబడుతున్నారు.

(Visited 130 times, 1 visits today)