Home / Inspiring Stories / ప్రాణం పోయినా సరే నేను నిలబడాలి

ప్రాణం పోయినా సరే నేను నిలబడాలి

Author:

Preethi

ప్రీతికుమారి రాయ్ డిల్లీ దగ్గర్లోని ఫరీదా బాద్ కి చెందిన ఈ 17 ఏళ్ళ అమ్మాయి, 8 ఏళ్ళ వరకూ అందరి బాలల్లాగే ఆడుతూ పాడుతూ పెరిగింది. ఏనిమిదో ఏటనుంచీ ఆమే అడుగులు తడబడ్డాయ్, నెమ్మదిగా ఆమె వెన్నెముక మెలితిరిగిపోవటం ప్రారంబించింది. నలుగురు కుమారులు పుట్టి చనిపోగా ఆఖరున మిగిలిన ఒక్కాగానొక్క కూతురిని అల్లారు ముద్దు గా పెంఛుకున్నామె తల్లి తండ్రులు దిలీప్ రాయ్, మీనాదేవీ లు ఎందరో వైద్యుల చుట్టూ తిరిగారు ఫలితం మాత్రం శూన్యం. ప్రీతి కి కంజెంటియల్ స్కోలియోసిస్ అనే జబ్బు సోకింది అనే విశయం చెప్పటం తప్ప ఏమీ చేయలేక పోయారు డాక్టర్లు. ఆమె వెన్నుపూస అలానే మెలితిరుగుతూ పోయింది నెమ్మది నెమ్మది గా ప్రీతి నడవటం కూడా కష్టమయ్యేంతగా ఆమె వీపు వంగిపోయి గూని వచ్చేసింది.

ఆమెకి జబ్బు సోకిన దగ్గరినుంచీ ఆమెను 10 మందికి పైగా డాక్టర్లు పరీక్షించారు. ఆమె నిఠారుగా నిలబడటం కష్టమే అన్నారు. కొందరు ఆపరేషన్ చేస్తే నయమై పోతుందీ అన్నారు కానీ ఆపరేషన్ చేసేందుకు మాత్రం ఏ డాక్టరూ ముందుకు రాలేదు. ఐతే ఈ పదేళ్లకి డిల్లి అపోలో హాస్పిటల్ లోని డా.రాధాకృష్ణన్ అనే డాక్టర్, ఆమె కి ఆపరేషన్ చేయటానికి ముందుకొచ్చాడు. ప్రీతిని పరీక్షించిన ఆయన తాను చేసే ఆపరేషన్ వల్ల ఆమె పూర్తి స్థాయిలో కోలుకోక పోయినా ఇప్పుడున్నదానికంటే చాలా రెట్లు మెరుగుగా ఉంటుందని మాత్రం చెబుతున్నాడు. ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నప్పుడు చూసిన ఎన్నొ కేసుల లాంటిదే అయినా, ప్రీతి ఉన్న పరిస్థితుల్లో ఆపరేషన్ చేయటం అంటే ప్రమాదమే, ఆమె ప్రాణాలకూ ప్రమాదం ఉండొచ్చు అని చెప్తున్నాడు. ప్రీతి మాత్రం నేను ఒక్క క్షణం నిలబడి మరో క్షణం లో చనిపోయిన పరవాలేదు కానీ ఈ ఆపరేషన్ జరిగి తీరాలనే పట్టు బడుతోంది. తన చిన్ననాటి ఆటల్లో తాను కోల్పోయిన సంతోషాన్ని ఎవరూ తీసుకు రాలేరనీ, తాను జీవితాంతం ఇలా “గూని” గా బతికేకన్నా ఒక్క రోజు తనకు తానుగా నిఠారుగా నిలబడి చనిపోవటం మేలనుకుంటోంది ఈ అమ్మాయి. ఇప్పటి వరకూ తాను మార్కెటింగ్, కాల్ సెంటర్లలో పార్త్ టైం గా జాబ్ చేసుకుంటూనే తన చదువుని కొనసాగించింది తప్ప, నెలకు పదివేలు సంపాదించే తండ్రిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు కూడా భవిశ్యత్తులో తనవల్ల ఎవరికీ ఇబ్బంది ఉండకూడదనే ఈ ఆపరేషన్ కి సిద్దపడ్డానంటోంది ప్రీతి. వచ్చేనెలలో ఆమెకి ఆపరేషన్ జరగనుంది. ప్రీతి ఆపరేషన్ విజయవంతమవ్వాలని మీతోపాటు అలజడి.కాం కూడా కోరుకుంటూ, ప్రీతికోసం ప్రార్థిస్తోంది…

(Visited 148 times, 1 visits today)