Home / Entertainment / కూలీ ప‌నిచేసే మ‌హిళ‌….పేద‌ల‌కోసం ఏకంగా ఆసుప‌త్రినే నిర్మించింది.!

కూలీ ప‌నిచేసే మ‌హిళ‌….పేద‌ల‌కోసం ఏకంగా ఆసుప‌త్రినే నిర్మించింది.!

Author:

కొంత మంది జీవిత గాథలు ఇతరుల జీవితం మొత్తానికి సరిపడ స్పూర్తిని నింపుతాయ్. కోట్లకు కోట్లు, కనీసం నాలుగు తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు సంపాదించాలని ఆశతో బతుకుతున్న చాలామందికి , ఆశయం కోసం బతికిన సుభాషిణికి చాలా తేడా ఉంది. ఆ సుభాషిణి జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఆమె పేరు సుభాషిణి మిస్త్రీ… ఆమెది కలకత్తా.

రోగంతో ఉన్న భర్తకు సరైన వైద్యం అందక ఆయన 23 వయేట మరణించాడు. ఆమె అప్పుడే తన మనస్సులో తన భర్తలా మరెవ్వరికి ఈ పరిస్థితి రావొద్దనుకుంది. అప్పటికే నలుగురు చంటి పిల్లలు, అంతగా ఆస్తిపాస్తులు కూడా లేవు. కళ్ళముందు పెద్ద లక్ష్యం, కానీ గుండెలో అంతకు మించిన సంకల్ప బలం.

Subhasini Mistry worked as brick-layer and maid to build hospital for the poor

మొదట ఇంటి దగ్గరున్న స్కూల్ లో ఆయాగా చేరింది. మ‌రోవైపు కూర‌గాయ‌ల‌ను సైతం అమ్మింది. వచ్చిన సంపాదనతో ఇంటి ఖర్చులు వెల్లదీస్తూనే.. కొంత పొదుపు చేసింది. తర్వాత పిల్లలు కాస్త ఎదగడంతో సొతంగా ఇటుకలను తయారు చేయడం స్టార్ట్ చేసింది. వ్యాపారం బాగా నడుస్తున్న క్రమంలో హాస్పిటల్ నిర్మాణం కోసం. దాదాపు అర ఎకరం స్థలం కొన్నది.ఇక హాస్పిటల్ నిర్మాణానికి విరాళాల కోసం బయలు దేరింది సుభాషిణి. చాలా మంది డబ్బును, కొంతమంది ఆసుపత్రి నిర్మాణానికి కావాల్సిన వస్తువులను, మరికొంత మంది వాలెంటరీగా కూలి పనికి వచ్చారు. అతికష్టం మీద ఓ గది నిర్మించబడింది.

అక్కడికి దగ్గర్లో ఉండే ముగ్గురు డాక్టర్లు తమ సమయానికి అనుగుణంగా ఫ్రీగా వైద్యం చేయడానికి ముందుకొచ్చారు. ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి రావడంతో 1996 లో వెస్ట్ బెంగాల్ గవర్నర్ అక్కడ ఓ పర్మినెంట్ బిల్డింగ్ కు శంకుస్థానపన చేశారు.ఇప్పుడు ఆ ఆసుపత్రి.. అతి తక్కువ ధరకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తూ మంచి పేరును సంపాదించింది. మరో విషయం ఏంటంటే సుభాషిణి చిన్న కొడుకు అజయ్ అందులో డాక్టర్ . డాక్టర్ చదవడానికి అతడు పడిన కష్టం పేదలకు ఫ్రీగా వైద్యం చేస్తున్నప్పుడు కలిగే ఆనందంలో కొట్టుకుపోయిందంటాడు అజయ్. తను నిర్మించిన హాస్పిటల్ ను చూసుకొని మురిసిపోతోంది సుభాషిణి.

(Visited 1 times, 1 visits today)