Home / Entertainment / మనం ఎవరికీ తక్కువ కాదు అంటున్న సుధీర్ బాబు

మనం ఎవరికీ తక్కువ కాదు అంటున్న సుధీర్ బాబు

Author:

sudheerbabu in baaghi

సుధీర్ బాబు సినిమా పరిశ్రమకి వచ్చి 4-5 సవత్సరాలు అయింది. మనోడి ఖాతాలో కొన్ని చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నా, రావలసిన అంత పేరు రాలేదనే చెప్పాలి. సుధీర్ బాబు మనకు సూపర్ స్టార్ క్రిష్ణ అల్లుడిగా,మహేష్ బాబు బావగా  సుపరిచితుడే…

‘సుధీర్ బాబు’ ఈమధ్యనే బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ‘టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్’ హీరో హీరోయిన్లుగా దర్శకుడు ‘షబ్బీర్ ఖాన్’ తెరకెక్కించిన ‘బాగి’ సినిమాలో సుధీర్ బాబు ఓ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. పూర్తి యాక్షన్ సన్నివేషాలతో సాగే ఈ ట్రైలర్ కు దేశవ్యాప్తంగా భారీ స్పందన లభించింది. ఈ ట్రైలర్ గురించి సుధీర్ బాబు తన ట్విట్టర్ లో ‘ఈ ట్రైలర్ అప్ లోడ్ చేసేటప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చాయి’ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ‘ఎక్కడో బాలీవుడ్ లో ఒక్క చాలెంజింగ్ రోల్ కోసం వెతుక్కుంటూ ఒక తెలుగోడిని తీసుకుపోయారు.. మనం ఎవరికీ తక్కువ కాదు’ అంటూ తన బాలీవుడ్ ఎంట్రీపై తనకున్న నమ్మకాన్ని తెలిపారు.

sudheer babu tweet about Baaghi movie

(Visited 286 times, 1 visits today)