Home / Entertainment / సుకుమార్ ‘డైరెక్టర్’ హీరో ఫిక్స్ !?

సుకుమార్ ‘డైరెక్టర్’ హీరో ఫిక్స్ !?

Author:

Sukumar

టాలీవుడ్ ఇంటిలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ ఆర్య, జగడం, ఆర్య 2, 100% లవ్, 1 – నేనొక్కడినే ఇప్పుడు నాన్నకు ప్రేమతో విడుదల కావలసి ఉంది. సుకుమార్ ఇప్పటి వరకు తను డైరెక్షన్ చేసినవి 5 సినిమాలు మాత్రమే కాని తనకంటు తెలుగు సినిపరిశ్రమలో ఒక స్థానన్ని ఏర్పరుచుకున్నాడు. బయట సినిమాలకు డైరెక్షన్ చేస్తూనే తన సొంత బ్యానర్ లో కొత్తదనం నిండిన కథ, స్క్రీన్ ప్లే అందిస్తు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తన బ్యానర్ లో సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మించిన ‘కుమారి 21ఎఫ్’ సినిమా భారీ హిట్ ను అందించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరిన్ని కొత్తదనం నిండిన సినిమాలను తన బ్యానర్ లో నిర్మించే యోచనలో ఉన్నాడు సుకుమార్.

ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం సుకుమార్.. ‘కుమారి 21ఎఫ్’ తర్వాత వెంటనే తన బ్యానర్ లో తన సెకండ్ మూవీ మొదలుపెట్టబోతున్నాడనే వార్త వినిపించింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ ఇంటిలిజెంట్ డైరెక్టర్ ఈ తాజా సినిమా ద్వారా తన సోదరుని కుమారుడైన అశోక్ ను పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘డైరెక్టర్’ అనే టైటిల్ ని కూడా పెట్టారు. త్వరలోనే ఈ విషయం అధికారికంగా నిర్ధారణ కానున్నట్లు సమాచారం.

(Visited 64 times, 1 visits today)