Home / Entertainment / డైరెక్షన్‌కు గుడ్ బై అంటున్న క్రియేటివ్ డైరెక్టర్.

డైరెక్షన్‌కు గుడ్ బై అంటున్న క్రియేటివ్ డైరెక్టర్.

Author:

Sukumar @ Krishna Gadi Veera Prema Katha Audio Launch Stills

సుకుమార్ తను ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఆర్య, జగడం, ఆర్య2, 100% లవ్,1 – నేనొక్కడినే, ఇప్పుడు రీసెంటుగా వచ్చిన సినిమా నాన్నకు ప్రేమతో…మార్క్ రివెంజ్ డ్రామాగా పేరు తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ కొల్లగొడుతోంది.

తన సినిమాలలో స్టోరి, టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకుంటాడు ఈ లెక్కల మాస్టార్.ఇప్పుడు సుకుమార్ టాలీవుడ్ కు పెద్ద షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు . క్రియేటివ్ డైరెక్టర్ అయిన సుకుమార్ ఇక డైరెక్షన్ చేయబోడట ! ఇది నిజంగా టాలీవుడ్ కు పెద్ద షాకింగ్ న్యూసే. ఎందుకంటే దర్శకుడిగా తాను సినిమాకు పూర్తి స్థాయిలో అనుకున్న న్యాయం చేయలేకపోతున్నానని, కథలో రాసుకున్న విషయాలను అనుకున్నట్లుగా చిత్రీకరించలేకపోతున్నానని, మరో రెండు సినిమాలు తీసిన తర్వాత దర్శకత్వం చేయబోనని ప్రకటించడం ఇప్పుడు తెలుగు సినీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది.దర్శకత్వానికి గుడ్‌బై చెప్పి పూర్తి స్థాయిలో రచయితగా, నిర్మాతగానే వ్యవహరిస్తానని సుకుమార్ సంచలన కామెంట్స్ చేశారు.మధ్యే కుమారి 21ఎఫ్ కు సుకుమార్ రైటింగ్స్ తో స్టార్ట్ చేశాడు.అలాగే సినిమా కూడా నిర్మించాడు.ఇక నుంచి ఇదే పుల్ టైగా చేయనున్నాడట!

(Visited 300 times, 1 visits today)