Home / Entertainment / వీర్యం దానం చేయ్యనున్న అక్కినేని హీరో.

వీర్యం దానం చేయ్యనున్న అక్కినేని హీరో.

Author:

Sumanth doing Vicky Donor Remake

అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున మేనల్లుడు సుమంత్ హీరోగా సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ప్రేమ కథ చిత్రంతో మొదలైంది. ఇతడు తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే 2003 లో జెనీలియా తో నటించిన సత్యం తో చిత్రసీమలో స్థిరపడ్డాడు. మళ్ళీ కొన్ని వైఫల్యాల తర్వాత 2006 సంవత్సరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు. తర్వాత కాలంలో విడుదలైన చిన్నోడు, గౌరి అంతగా హిట్ కాలేదు. మధుమాసం మళ్ళీ బాక్సాఫీస్ లో బాగా ఆడింది ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయినా స్టార్ హీరో రేంజికి ఎదగలేక పోయాడు. అయితే తనకు సూటయ్య సినిమాలు ఎంచుకుంటూ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆయన సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ కాక పోవడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకున్నాడు సుమంత్. ఎట్టకేలకు సుమంత్‌కు ఓ ప్రాజెక్టు ఓకే అయింది. బాలీవుడ్ హిట్ మూవీ ‘వికీ డోనర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హిందీ వెర్షన్లో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రను తెలుగులో సుమంత్‌తో చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బాలీవుడ్‌లో ‘విక్కీ డోనార్’ సినిమా విడుదలప్పట్నుంచీ ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతుందంటూ వార్తలు రావడమే కానీ, అందులో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా ఈ రీమేక్‌కు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న సుమంత్, తనకు ఈ రీమేక్ ద్వారా హిట్ వస్తుందన్న నమ్మకంతో వెంటనే ఈ ప్రాజెక్టును ఓకే చేశారని తెలుస్తోంది. కొత్త దర్శకుడుసినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడిగా పరిచయంకాబోతున్నారు. పల్లివి శుభాష్ అనే భామను హీరోయిన్ గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని సమాచారం.

(Visited 463 times, 1 visits today)