Home / Inspiring Stories / అరసవల్లి లో అద్భుతం, స్వామివారిని తాకిన సూర్య కిరణాలు

అరసవల్లి లో అద్భుతం, స్వామివారిని తాకిన సూర్య కిరణాలు

Author:

arasavalli temple

శ్రీకాకుళం అరసవల్లి సూర్య దేవాలయం లో సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే జరిగే అద్బుతం నిన్న మళ్ళీ చోటు చేసుకుంది. సంవత్సరానికి రెండు పర్యాయాలు సూర్య కిరణాలు ఉదయసంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. అంటే సంవత్సరం లో రెండుసార్లు అదీ కొద్ది నిమిషాల పాటు మాత్రమే ఈ దేవాలయం లోని మూలవిరాట్టు మీద సూర్య కిరణాలు పడతాయి. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచి లోని కామేశ్వరాలయంలో కూడ యిలాంటి ఏర్పాటు వుంది. ప్రతి సంవత్సరం మార్చి, అక్టోబర్ లలొ ఇది జరుగుతుంది.

కాగా నిన్న అరసవల్లిలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్‌ను గురువారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి జనాలు తండోపతండాలుగా విచ్చేశారు. ఉత్తరాయన పుణ్యకాలంలో స్వామివారిని సూర్యకిరణాల స్పర్శ తాకింది. ఉదయం 6.24 గంటలకు మొదలై 6.30 గంటల వరకు ఆరు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామి మూలవిరాట్‌పై పడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకున్నారు.ఇది ప్రతీ ఆరునెలలకి ఒకసారి జరిగేదే అయినా చూడటం అంత సులభం కాదు ఉదయాన్నే ఆవరించి ఉండే మేఘాలు. చాలా సార్లు సూర్య కిరణాలని అడ్డుకుంటాయి. మేఘాలు తొలగి పోయే సమయానికి స్వామివారిమీద పడే సూర్య కిరణాలు తమ కోణాన్ని మార్చుకుంటాయి. భారతదేశం లో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. ఒరిస్సాలో సుప్రసిద్ధమైన కోణార్క్ సూర్యదేవాలయంలో సైతం ఇక్కడి మాదిరిగా ఇప్పుడు నిత్యపూజలు జరగడంలేదు.

ఈ ప్రాంతం 17 వ శతాబ్దంలో నిజాము నవాబు పాలన క్రిందికి వచ్చింది. ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలను అనేకం ధ్వంసం చేశాడు. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాలలో అరసవిల్లి కూడా వుంది. సుబేదారుకు హిందువుల న్యాయశాస్త్రం గురుంచి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవిల్లి దేవాలయంపై జరగనున్న దాడిని గురించి ముందుగా తెలుసుకొని ఎలాగో స్వామి మూలవిరాట్టును పెకలించి ఒక బావిలో పడవేయించాడట. 150 సంవత్సరాల క్రితం ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలోనుంచి ఆ విగ్రహాన్ని తీయించాడట. దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి , అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ వుంది.

(Visited 940 times, 1 visits today)