Home / Entertainment / డబ్బుల్లేక నడుచుకుంటూనే వెళ్ళేవాడిని – సునీల్

డబ్బుల్లేక నడుచుకుంటూనే వెళ్ళేవాడిని – సునీల్

Author:

Sunil-on-Tollywood-Movies

వాసువర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా డింపుల్ చోపాడే,నిక్కి గల్రాని హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.దిల్ రాజు నిర్మాణంలో సునీల్ హీరోగా నటిస్తున్న ‘కృష్ణాష్టమి’ చిత్రం యొక్క ప్రమోషన్ లో భాగంగా సునీల్ తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ గురించి చెప్పిన మాటలు.

సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు కృష్ణనగర్ లో ఒకే రూమ్ లో ఉండేవాళ్లమని.., అప్పట్లో ఎక్కడికి వెళ్ళిన ఒక డొక్కు స్కూటర్ పై వెళ్ళే వాళ్ళమని..అప్పుడు కష్టమనిపించేది.., కాని ఇప్పుడు ఖరీదైన కార్లలో తిరుగుతున్న ఆ తృప్తి దొరకడం లేదని కమెడియన్ కమ్ హీరో సునీల్ చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ…. బస్సు టికెట్ కి కూడా డబ్బులు లేక కాలినడకన తిరిగిన రోజులు కూడా ఉన్నాయని, చాలా కష్టపడి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రేక్షకులకు దగ్గరయ్యానని సునీల్ చెప్పుకొచ్చాడు.

(Visited 134 times, 1 visits today)