Home / Entertainment / సుప్రీమ్ సినిమా రివ్యూ & రేటింగ్.

సుప్రీమ్ సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Suprem Movie Perfect Review and Rating సుప్రీం సినిమా రివ్యూ  రేటింగ్

మెగాస్టార్ మేన‌ల్లుడిగా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టి నటించిన మూడు సినిమాలతోనే తనకంటు ఒక పేరు తెచ్చుకున్న హీరో సాయిధ‌ర‌మ్ తేజ్. ఇప్పుడు తన నాలుగవ చిత్రం సుప్రీమ్ తో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశీ ఖ‌న్నా నటించింది. ఈ చిత్రాన్ని ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం చేసారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు మన ముందుకువ వచ్చిన ఈ సినిమా ఏలా ఉందో ఒక సారి చూద్దాం…

కథ:

సుప్రీమ్ స్టోరీ అనంత‌పురం జిల్లాలోని ఓ గ్రామంలో స్టార్ట్ అవుతుంది. అక్క‌డ‌ రాజవంశీయులు తమ ఆస్తి మొత్తాన్ని గ్రామంలో ఉన్న 15 వేల రైతు కుటుంబాలకు వదిలేసి విదేశాలకు వెళ్లిపోతారు. అయితే ఆ కుటుంబానికి చెందిన ఓ ట్ర‌స్టు అక్కడ విద్య, వైద్య వంటి అన్ని సేవలు చూసుకుంటుంది. ఈ ట్రస్ట్ ను సాయికుమార్ నిర్వహిస్తుంటాడు. ఈ భూములపై పారిశ్రామికవేత్తల కన్ను పడటం..రాజకీయ పలుకుబడితో ఈ భూములను ఆక్రమించుకోవాలని చూడటం..దీన్నుంచి హీరో ఎలా వాటిని రక్షిస్తాడు అన్నదే సుప్రీమ్ క‌థ‌.

అలజడి విశ్లేషణ:

కథ ఏమీ కొత్తది కాదు. పాట చింతకాయ పచ్చడిని కొత్త జాడిలోనించి మనకు వద్దించారు. అయితే ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ సినిమా కథ‌ను న‌డిపించిన విధానం మాత్రం సూప‌ర్బ్‌గా ఉంది. మెగా ఫ్యామిలీ నుండి ఓ హీరో వచ్చాడంటే ముందుగా అతడి యాక్టింగ్ , డాన్సు ల ఫై అందరు అంచనాలు పెంచుకుంటారు..వాటిని రీచ్ కావడం ల సాయి ధరమ్ తేజ్ 100 మార్కులు కొట్టేసాడని మరోసారి చెప్పవచ్చు.. పిల్ల నువ్వు లేని జీవితం , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలతో మెగా మార్క్ కొట్టేసిన సాయి , ఈ చిత్రంలోనూ ఏమాత్రం తీసిపోలేదు. ముఖ్యంగా చిరు సాంగ్ ‘ అందం హిందోళం’ లో రాశి ఖన్నా , సాయి డాన్సు లతో చించేసారు. మరోసారి తెర ఫై చిరంజీవి , రాధలను గుర్తుచేసారు. ఈ సాంగ్ కు ధియేటర్ అంత విజిల్స్ తో మారుమోగిపోయింది. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది. కారుదొంగతనాలు చేసే పృథ్వీ, శ్రీనులు ఎపిసోడ్‌. అదేకాకుండా క్లెమాక్స్‌లో దివ్యాంగులు (వికలాంగులు) చేసే యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. లింక్‌పరంగా ముందు ఓ సీన్‌పెట్టి.. దాన్ని క్లెమాక్స్‌లో కలిపిన విధానం బాగుంది.

ఆలోచించే ఆకట్టుకునే మాటలున్నాయి. గతాన్ని మర్చిపోవడానికి ఒక్కరాత్రి తాగితే సరిపోతుందనుకుంటే.. బతుకంటే ఏమిటనేది ఒక్కరాత్రే తెలిసిదంటూ.. సన్నివేశపరంగా వచ్చేవి పేలాయి. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది.. రాజన్‌ అనే పాత్ర. పిల్లాడి పాత్ర. తను ముంబైకు చెందిన నటుడు. ఎన్‌ఆర్‌ఐగా బాగా సరిపోయాడు. చిత్రంలో పిల్లాడి పాత్రే కీలకం. రూ.వేల కోట్ల భూములకు వారసుడు తనే. అలాంటివాడు అనాథగా.. బతికే సీన్‌ వచ్చినప్పుడు దర్శకుడు సెంటిమెంట్‌ను బాగా ఉపయోగించుకున్నాడు. ఇలా ప్రతి సన్నివేశాన్ని సెంటిమెంట్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అయితే ముందు చేసిన ‘పటాస్‌’ మల్లే ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌ అయినా.. యాక్షన్‌ బాగానే వుంది.

ప్రతి సినిమాలో యాక్షన్‌ ఓవర్‌గా ఉంటుంది. ఇందులోనూ అలానే వుంది. అయితే కొన్ని చోట్ల లాజిక్కులు వుండవు. తండ్రి తాగుబోతు. కొడుకు టాక్సీ తొలి సంపాదిస్తున్నాడు. ఒకప్పుడు బాగా ఉన్నవాడని చెబుతాడు. జాగృతి సంస్థవారసులమో అనే బిల్డప్‌ ఇస్తాడు. కానీ తర్వాత అతనెవరేది చెప్పరు. ఏదో కథను నడిపే పాత్రగా రాజేంద్రప్రసాద్‌ పాత్ర వుంది. ఇక బాణీలపరంగా కొత్తగాలేకపోయినా.. వినడానికి బాగున్నాయి.

సాంకేతిక వర్గం పనితీరు:

ప్రొడక్షన్ విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర బ్యానర్ అంటేనే హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకోవచ్చు..కథ విషయంలో దిల్ రాజు కు మంచి పట్టు ఉండడంతో, సినిమా ఎంపిక లో ఆచితూచి అడుగువేస్తాడు.. ఇక అనిల్ రావిపూడి పటాస్ వంటి కమర్షియల్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతిలో పడ్డాడు..కానీ పటాస్ లో ఉన్నంత కామెడీ ఇందులో పెట్టలేకపోయాడు.. కాకపోతే యాక్షన్ , కామెడీ , రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ సమపాళ్ళలో ఉండే విధంగా చూసుకోగలిగాడు.

ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చెప్పుకోవాలి..సాయి శ్రీరామ్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎక్కడ కూడా డల్ గా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు..చిరు సాంగ్ రీమేక్ కు తన మ్యూజిక్ తో అదరగొట్టాడు..ఎడిటింగ్ విషయానికి వస్తే ఎం. ఆర్ వర్మ అక్కడక్కడ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.

ప్ల‌స్‌ పాయింట్స్ :

  • క‌థ‌నం
  • కామెడీ
  • సాయిధ‌ర‌మ్, రాశి ఖన్నాల యాక్టింగ్
  • సినిమాటోగ్రఫీ

మైన‌స్‌ పాయింట్స్ :

  • రొటీన్ స్టోరీ
  • ఎడిటింగ్

అలజడి రేటింగ్ : 3/5

పంచ్ లైన్: “సుప్రీమ్ ఫుల్ సౌండ్ ఫుల్ ఎంటర్టైనర్

(Visited 4,638 times, 1 visits today)