Home / Latest Alajadi / సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు

సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు

Author:

దంపతులు విడాకులు తీసుకోవాలంటే ఆరునెలల గడువు అవసరం. అంత సమయం అవసరం లేదని… వెంటనే డైవర్స్ తీసుకోవచ్చని తెలిపింది. ప్రరిస్థితుల ప్రభావంతో ప్రస్తుతం కాలంలో కొంత మంది దంపతులు రోజు గొడవలకు దిగుతున్నారు. అది కాస్తా డైవర్స్ వరకు వెళ్తున్నాయి.

మ్యారేజ్ అయిన కొద్ది రోజులకే విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే దంపతుల మధ్య రాజీ కుదిర్చేందుకు ఆరు నెలల గడువు ఇస్తుంది కోర్టు. అయితే అది కూడా అవ‌స‌రం లేకుండా తక్షణమే విడాకులు తీసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమ‌తి ఇచ్చింది. స్నేహితుల్లా విడిపోవాలనుకునే వారికి ఈ వ్యవధితో పని లేదని కోర్టు స్ప‌ష్టం చేసింది.

Supreme Court Waives 6-month Waiting Period for Mutual Divorce

ఓ విడాకుల కేసులో రాజీకి వ‌చ్చిన జంట కేసులో తీర్పును ఇస్తూ సుప్రీం ధ‌ర్మాస‌నం ఈ విష‌యం తెలిపింది. పరస్పర సమ్మతితో విడాకులు డిక్రీ జారీ చేయడం ద్వారా సుప్రీం కోర్టు ఈ వివాహాన్ని రద్దు చేసింది.

(Visited 1 times, 1 visits today)