Home / Inspiring Stories / దొంగ జబ్బులతో కేసుల నుండి తప్పించుకునే వారి ఆటలు ఇక చెల్లవు.

దొంగ జబ్బులతో కేసుల నుండి తప్పించుకునే వారి ఆటలు ఇక చెల్లవు.

Author:

పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బాగా డబ్బున్న వారికి కోర్టు ఎదైన కేసులో జైలు శిక్ష విధిస్తే దానిని తప్పించుకోవడానికి వారు మొదట చేసేది దగ్గరలోని హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, అంతవరకు బాగానే వున్న వారు పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తున్నారని తెలియగానే చాతిలో నొప్పి అనో, మరో ఇంకేదో నొప్పి అనో ధర్జాగా మంచి ప్రైవేట్ ఆసుపత్రి చూసుకొని చికిత్స పేరుతో ఏ.సీ రూముల్లో ఎంజాయ్ చేస్తారు ఇలాంటి సంఘటణలు మనం చాలా చూసాం, చూస్తూనే ఉన్నాం. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని డాక్టర్లకు, ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి చికిత్స పేరుతో శిక్ష తప్పించుకుంటున్న నేరస్తులను ఇక వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. విచారణకు హాజరు కాకుండా, జైలు శిక్షను తప్పించుకొని ఆసుపత్రి లో గడిపే దొంగ రోగులకు సహకరించిన డాక్టర్లకు కూడా జైలు శిక్ష, ఆసుపత్రికి భారి జరిమానా విధిస్తామని తెలిపింది సుప్రీం కోర్టు.

supreme warning for hospitals

హర్యాణ కు చెందిన మాజీ ఎమ్మెల్యే బల్బీర్ సింగ్ మే 5, 2013 న ఒక మార్కెట్ లో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ సంఘటనలో ఒక వ్యక్తి చనిపోగా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. తన రాజకీయ పలుకుబడితో వెంటనే అరెస్ట్ కాకుండా బెయిల్ సంపాదించాడు బల్బీర్ సింగ్, కాని సాక్షాధారాలు పరిశీలించిన కోర్టు అక్టోబర్ 24, 2013 న అతని బెయిల్ను రద్దు చేసి పోలీసుల వద్ద లొంగిపోవాలని అదేశించింది. పోలీసులకు లొంగిపోవాల్సిన బల్బీర్ చాతి నొప్పి పేరుతో గురుగ్రాం లోని ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆసుపత్రి వారికి డబ్బు ఆశ చూపడంతో వారు కూడా అతనికి ఏ జబ్బు లేకపోయినా, అతని కండీషన్ సీరియస్ గా ఉందని, చికిత్స అందిస్తున్నామని పోలీసులకు తప్పుడు రిపోర్టులు ఇచ్చారు. ఇలా 527 రోజులు చికిత్స పేరుతో బల్బీర్ సింగ్ పోలీసుల విచారణ నుండి తప్పించుకున్నాడు. కాని ఈ కేసును విచారించిన సీబీఐ వారికి ఆసుపత్రి మీదా అనుమానం వచ్చి విచారణ చేయగా డొంకంతా కదిలింది. ఈ కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు జడ్జీ, నేరస్తులకు శిక్ష పడకుండా సహకరించిన డాక్టర్లు, ఆసుపత్రి మేనేజ్మెంట్ వారు కూడా నేరస్తులే అని ప్రకటించి ప్రైవేటు ఆసుపత్రి యజమానికి మరియు డాక్టర్లకు 70 లక్షల రూపాయలు ఫైన్ వేసింది. ఇక ముందు ఇలాంటి నేరస్తులకు సహకరిస్తే ఆసుపత్రులు సీజ్ చేయడంతో పాటు జైలు శిక్షలు విధిస్తామని హెచ్చరించింది సుప్రీం కోర్టు.

(Visited 215 times, 1 visits today)