Home / Entertainment / థార్ ఎడారిలో మెగా హీరో.

థార్ ఎడారిలో మెగా హీరో.

Author:

Suprem Movie Photos

యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుసగా ఇప్పుడు వస్తున్న హీరోలలో మంచి హీజ్ ఉన్న హీరో అందుకే మనోడి కి వరుస హీట్స్ తో పాటూ వరుసా సినిమాలు కూడా వస్తునాయి. అయితే ఇదే ఏడాది పటాస్’ సినిమాతో హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి చేస్తున్న సినిమా ‘సుప్రీమ్’. రెండు షెడ్యూల్స్ తర్వాత సుప్రీమ్ కి గ్యాప్ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ షెడ్యూల్ ని రాజస్థాన్ థార్ ఎడారిలో మొదలు పెట్టాడు. ప్రస్తుతం తర ఎడారి, జైసల్మీర్ లొకేషన్స్ లో సాయి ధరమ్ తేజ్ – రాశీఖన్నాలపై వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్ ని షూట్ చేస్తున్నారు.

ఈ సాంగ్ షూట్ తర్వాత మరో షెడ్యూల్ ని హైదరాబాలో మొదలు పెట్టనున్నారు. సాయి ధరమ్ తేజ్ ఓ టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్న ఈ సినిమా లో రాశీ ఖన్నా కేవలం గ్లామ్ డాల్ గానే కాకుండా రిస్క్ లు చేసే పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపించనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాని పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. దిల్ రాజు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేస్తున్న మూడవ సినిమా ఇది.ఇక సాయిధరమ్ తేజ్ హీరోగా దిల్‌రాజు నిర్మించనున్న మరో సినిమా ‘శతమానం భవతి’ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.

అలాగే సాయిధరమ్ తేజ మరో చిత్రం కమిటయ్యారు. కళ్యాణ్ రామ్ తో ఓం తీసిన సునీల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం లాంచింగ్ ఈ రోజు జరిగింది. ఈ చిత్రానికి సంభందించి తిక్క అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. దానికి ట్యాగ్ లైన్ గా… ‘హ్యాండిల్ విత్ కేర్’ అని పెడుతున్నట్లు తెలుస్తోంది.రోహిన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత.

(Visited 86 times, 1 visits today)