Home / Inspiring Stories / సార్ గా వచ్చి మేడం గా మారాడు

సార్ గా వచ్చి మేడం గా మారాడు

Author:

Transgenders

ట్రాన్స్ జెండర్ ఎంపీ, ట్రాన్ జెండర్ ప్రిన్సిపాల్, ట్రాన్స్ జెండర్ పోలీస్ అధికారి… భారత దేశం లో నానాటికీ ట్రాన్ జెండర్ గాపిలవబడే థర్డ్ కేటగిరీ పట్ల ఇదివరకున్న వివక్ష తగ్గు ముఖం పడుతూ వస్తూంది. మామూలు మనుషులతో సమానంగానే హిజ్రాలనూ గౌరవించాలనే స్పృహ పెరుగుతోంది. ప్రధాన పట్టణాలలో అధిక సంఖ్యలో ఉండే వీరిపై ఎవరూ ఆలోచించనంత ఉన్నతంగా ఆలోచించి వారి కంటూ ఉండే ఒక అస్తిత్వాన్ని గుర్తించిన మొదటి రాష్ట్రం బెంగాల్. ఇది వరకే మనభీ బందోపాధ్యాయ అనే ఒక హిజ్రాని ఒక కాలేజీ కి ప్రిన్సిపల్ గా చేసిన బెంగాల్ మానవాభివృద్ది వనరుల శాఖ ఒక విప్లవాత్మకమైన నిర్ణయాని తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. భారత్ లాంటి దేశాల్లో ఇటువంటి పరిణామం మామూలుదేం కాదు. ఈ ఘటనతో దేశవ్యాప్త హిజ్రాలలో ఆత్మ విశ్వాసం పెరిగింది. మిగిలిన పౌరులలో కూడా వారంటే ఉన్న వ్యతిరేఖ భావన కూడా కొంత వరకూ తగ్గిపోయి హిజ్రాలకూ చదువుకోవటానికీ అవకాశం ఏర్పడింది… అదే బాటలో ఈ సారి బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశ్చర్య కరం అయినా అదీ అహ్వానించదగ్గదే.

Yasini

అదే దారిలో చెన్నై లోని ప్రితికా యాషిని అనే ఒక హిజ్రా పోలీస్ ఎస్సై గా ఉధ్యోగం సంపాదించిందింది. ఐతే దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడు లో ఆమెకి అంత సులభంగా సాధ్యం అయిందేం కాదు. ఆమె తన ఉధ్యోగం కోసం పోరాటమే చేయల్సి వచ్చింది. ఐతే చివరకు న్యాయ పోరాటం లో యాషినీ గెలుపు సాధించింది. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగానికి ప్రితికా అర్హురాలేనని స్పష్టం చేసింది.

rithuparna

ఐతే వీరంతా ఒక ఎత్తైతే ఒదిశా కు చెందిన ఐష్వర్యా రుతుపర్ణా అనే ట్రాన్స్ జెండర్ అధికారిది మరో తరహా కథ. 2010లో ఉద్యోగంలో చేరినప్పుడు రుతుపర్ణా పేరు “రథి కాంత ప్రధాన్” అప్పట్లో ఆమె పురుషుడు. అంటే దాదాపు విధుల్లో చేరిన ఐదేళ్ళతర్వాత ఆమె లింగ మార్పిడీ ఆపరేషన్ ద్వారా పురుషుడి నుంచి స్త్రీగా మారారు. తన లింగమార్పిడి విషయాన్ని ప్రజలకు తొలిసారి ఇటీవల వివరించారు. 2014 ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు మూడో లింగం క్యాటగిరీ కింద ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపునివ్వడమే కాకుండా రాజ్యాంగపరమైన హక్కుల్ని కల్పిస్తూ ఇచ్చిన హక్కుని తాను వినియోగించుకున్నాఅని ఆమె అంటున్నారు. పురుషుడి గా ఉన్నప్పుడే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్ డిగ్రీని సాధించారు. బ్యాంక్ లో ఉద్యోగాన్నీ సాధించారు. ఈ ఉద్యోగంలో చేరకముందు జర్నలిస్ట్‌గా కూడా పని చేసారు. ఆ తర్వాత రాష్ట్ర సివిల్ సర్వీస్ పరీక్షలో విజేతగా నిలిచారు. ఇపుడు ఒడిశా ఆర్హిక శాఖలో చేరి ప్రస్తుతం పారాదీప్ పోర్ట్ టౌన్‌షిప్‌లో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (సీటీవో)గా సేవలందిస్తున్నారు.

“ఎప్పటినుంచో తాను పురుషుడిగా ఇమడలేక నరకం అనుభవించేదాన్ని, సుప్రీంకోర్టు నిర్ణయమే నేను ట్రాన్స్‌జెండర్‌గా మారడానికి కారణమైంది. ఏ రోజైతే కోర్టు నిర్ణయాన్ని ప్రకటించిందో ఆ రోజే నా లింగ హోదాను పురుషుడి నుంచి మూడో క్యాటగిరీ (ట్రాన్స్‌జెండర్)కి మార్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను. ప్రస్తుతం లభిస్తున్న గుర్తింపుతో గర్వంగా ఉన్నది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ధైర్యంగా సంప్రదాయ పద్ధతి ప్రకారం చీర ధరిస్తున్నాని ఇది నాకెంతో ఆనందంగా ఉంది” అని చెబుతోన్న రుతుపర్ణా ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో ఇప్పటివరకు తనకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాలేదని, ట్రాన్స్‌జెండర్ హోదా తన విధులకు అడ్డంకిగా మారలేదని ఐశ్వర్య తెలిపారు. తన పేరు మార్చుకొనేందుకు దరఖాస్తు చేసుకొన్నానని. త్వరలోనే ప్రభుత్వ రికార్డులో ట్రాన్స్‌జెండర్ క్యాటగిరీ వస్తుందని ఆమె చెప్పారు.

(Visited 483 times, 1 visits today)