Home / Entertainment / ‘సింగం3’కి టైం ఫిక్స్.

‘సింగం3’కి టైం ఫిక్స్.

Author:

Singam 3 movie details

సూర్య స్వతహాగా తమిళ హీరో కానీ తన సినిమాలతో తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోనే సూర్య. ‘సింగం’ సినిమా తో సౌత్ లో సూర్యకి ఉన్న క్రేజ్ అండ్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. ఈ సినిమాకి హరి డైరెక్టర్. దాంతో ఇప్పుడు సింగం 3 కోసం సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఫేమస్ మీసం లుక్ కి మారే పనిలో ఉన్నాడు. దాంతో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కి ముహూర్తం ఫిక్స్ చేసేసాడు. ఈ సినిమా ఫస్ట్ మేజర్ షెడ్యూల్ ని వైజాగ్ లో మొదలు పెట్టనున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం జనవరి 7 నుంచి సింగం 3 షూట్ వైజాగ్ లో మొదలవుతుంది. సుమారు 30 రోజులకి పైనే వైజాగ్ లో షూటింగ్ జరిపిన తర్వాత తమిళనాడులోని టుటికోరిన్ పోర్ట్ లో సెకండ్ షెడ్యూల్ ని మొదలు పెడతారు. ‘సింగం’ సిరీస్‌లోని రెండు పార్ట్స్ లోనూ హీరోయిన్‌గా నటించిన అనుష్క, ఈ మూడో పార్ట్ లోనూ కనిపించనుంటే, మరో హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనుంది. హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగులో ‘యముడు’గా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ కూడా పెద్ద హిట్ అయ్యింది. తాజాగా మొదటి సారి సౌత్ లో ఒక సినిమాకి ట్రైలాజీని ప్లాన్ చేసారు అదే ‘సింగం 3’.

(Visited 162 times, 1 visits today)