Home / Entertainment / “ఆటాడుకుందాం.. రా” టీజర్ లాంచ్ చేసిన నాగార్జున

“ఆటాడుకుందాం.. రా” టీజర్ లాంచ్ చేసిన నాగార్జున

Author:

అక్కినేని నటవారసుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన హీరో సుశాంత్. సుశాంత్ మొదటి సినిమా కాళిదాస్ చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత కరెంట్‌ సినిమాతో తనకంటు ఒక సపరేట్ స్టైల్ ని క్రీయెట్ చేసుకున్నాడు. ఆ తర్వాత అడ్డా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలలో హీరోగా నటించాడు. ఇప్పుడు సుశాంత్ చాలా రోజుల తర్వాత అనగా  దాదాపు రెండు సంవత్సరాల తర్వాత “ఆటాడుకుందాం.. రా” అంటూ మన ముందుకు వస్తున్నాడు.

ఈ చిత్రంలో  బ్రహ్మానందం , వెన్నల  కిషోర్, పృథ్విరాజ్  మరియు పోసాని నటించారు. ఈ రోజు తన పుట్టిన రోజు. కావున ఈ పుట్టిన రోజు సందర్బంగా “ఆటాడుకుందాం.. రా” సినిమా యొక్క ఒక నిమిషం వ్యవధి గల టీజర్ ని నాగార్జున తన ట్విట్టర్ ఖాతా @iamnagarjuna  లో లాంచ్ చేశాడు. ఈ టీజర్ లో కామెడీ మరియు  యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత చూపించారు.  ఈ సినిమా సుశాంత్ కి మరో మంచి హిట్ తెచ్చిపెట్టాలని ఆశిద్దాం…

 

(Visited 128 times, 1 visits today)