Home / Inspiring Stories / అడుక్కునే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి వారి జీవితాలని మార్చింది.

అడుక్కునే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి వారి జీవితాలని మార్చింది.

Author:

Swathi Bondia

స్వాతి బోండియా బెంగుళూరుకు చెందిన 18 సంవత్సరాల మామూలు భారతీయ యువతి. తన జీవితం తన కలలూ,కెరీర్ ఇలాగే ఆలోచించుకుంటూ ఉన్న అమ్మాయి. ఐతే ఒక్క రోజు ఘటన ఆమె లక్ష్యాన్నే మార్చేసింది. తన కంటూ ఒక జీవితం అనుకున్న ఆ అమ్మాయి ఇప్పుడు కొందరు పేద పిల్లల బతుకులని తీర్చిదిద్దటమే తన జీవితం అనుకుంటోంది. ఔను ఈ సాధారణ యువతి తను చేయాలనుకున్నవ్యాపారం లో ఏ కార్పోరేట్ చదువుల స్నేహితులనో కాకుండా తనకు కనిపించిన అమ్మాయిలాంటి రోడ్డు మీద జీవితాల వాళ్ళనే తన కంపెనీలో చేర్చుకుంది,అసలు ఏం జరిగిందంటే.

తన గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఒక రోజు స్నేహితురాలిని కలవటానికి బయల్దేరిన స్వాతి. రోడ్డు మీద దాదాపు తన వయస్సులోనే ఉన్న అమ్మాయి దీనంగా అడుక్కోవటం కనిపించింది. జాలిపడ్డ స్వాతి ఆ అమ్మాయికి ఏదో ఒకటి చేయాలనుకుంది. అంతే అక్కడే ఆటో దిగి తన దగ్గరున్న డబ్బులతో ఆ రోజుకి భోజం పెట్టించి,బట్టలు కొనిచ్చింది. ఆ అమ్మాయితో కొద్దిసేపు మాట్లాడి ఆమె గురించి అంతా తెలుసుకున్న తర్వాత నిర్ణయించుకుంది. తను చేయాల్సింది ఇంతే కాదు,ఒక్క రోజు భోజనం తోనో కొన్ని జతల బట్టల్తోనో వారి జీవితాలు మారవు… చాలా ఉందనిపించింది ఆ క్షణాన స్వాతికి. పద్దెనిమిది సంవత్సరాల స్వాతి ఓం శాంతి ట్రేడర్స్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభించింది.ఎవరికి తోచిన,వచ్చిన పద్దతిలో ఫర్నిచర్,ఇంటీరియర్ అలంకరణ వస్తువులు తయారు చేసే ఓం శాంతీ ట్రేడర్స్ మొదలై పోయింది. పని వచ్చిన వారు కొత్త వారికి నేర్పించారు,నేర్చుకున్నవారు ఆగకుండా పని చేస్తూ పోయారు… అందరూ ఒకప్పుడు అనాథలు, యాచకులు. అవును స్వాతి ఎంచుకొని మరీ స్ట్రీట్ పీపుల్ కి మాత్రమే ఉద్యోగాలిచ్చింది. వారికీ ఆర్థికంగా, సామాజికంగా ఒక స్థాయినీ తీసుకొచ్చింది. సమాజంలో గౌరవంగా బతకగలం అనే ఆత్మ విశ్వాసాన్ని వారిలో పెంచింది. అందరికీ ఒకే జీతం ఆఖరైకి స్వాతికి కూడా అదె 10,000 రూపాయలు మాత్రమే,నేను మేనేజర్ ని కాబట్టి ఎక్కువ జీతం ఇంకొకరు మామూలు పని చేసే మనిషి కాబట్టి తక్కువ జీతం అని ఏమీ ఉండదు. కంపెనీ లో ఉండే ప్రతీ ఒక్కరికీ అదే జీతం. అంతకంటే ఎక్కువ లాభాలు వస్తే ఉమ్మడి ఖాతాలొ వేస్తారట ఐతే ఇంకా అంత లాభాలను అందుకోలేదు.

Om Shanti Traders

ఈ యాచకులలో కుటుంబం ఉన్నవారికి కేవలం జీతం ఇవ్వటం మాత్రమే కాదు వారి పిల్లల చదువు, ఆరోగ్యం వంటివి స్వాతి దగ్గరుండి చూసుకుంటోంది. స్వాతి నడిపిస్తున్న స్వచ్ఛంద సంస్థ పనితీరును, స్వాతి సేవను గమనించిన ఐక్యరాజ్యసమితి కొలంబియాలో జరిగే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఛాలెంజ్ 2014కి స్వాతిని ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించాల్సిందిగా కోరింది.18 ఏళ్ళు కనీసం అంటే పెద్ద వయసేం కాదు. ప్రపంచం పై పెద్ద అవగాహణ కూడా లేదు. కానీ ప్రపంచానికి ఏదో చేయాలనే తపన మాత్రం ఉంది. అదే స్వాతి తో పాటు కొన్ని ఫుట్ పాత్ జీవితాల్లో వెలుగు నింపుతోంది. మార్పు అనేది ఎక్కడో మొదలు కావాల్సిందే అయితే ఈ మార్పుకి ఇక్కడ నేనే ఆ మొదలు ని… అయితే ఈ మార్పు ఇంకా పెరగాలంటే మాత్రం వీరందరి కృషీ ఉండాల్సిందే అనే స్వాతిని చూస్తే నమస్కరించాలని ఎవరికి మాత్రం అనిపించదు..!?

(Visited 1,331 times, 1 visits today)