Home / Political / పాలబుగ్గలపై నెత్తుటి మరకలు

పాలబుగ్గలపై నెత్తుటి మరకలు

Author:

పాలబుగ్గల పసివాడి బుగ్గలపై చిరునవ్వు ఉండాలి, చిన్న పిల్లల నవ్వుచూసి భాదలో ఉన్నవారు కూడా తమ భాదని మర్చిపోవాలి. కానీ ఆ దేశంలో పసిపిల్లల బుగ్గలపై నెత్తురు గడ్డకట్టి తుడిచినా పోనంతగా గట్టిగా మారిపోయింది. ఒక్కసారి మీరు చూడండి ఈ ఫోటో గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడు ఈ ఫోటో ప్రపంచాన్ని కన్నీటిమయం చేస్తుంది.

This Syrian boy photo melted world heart

ఈ పిల్లాడి పేరు ఒమ్రాన్. సిరియాలోని  అలెప్పో ప్రాంతంలో అతని తల్లిదండ్రులతో, ముగ్గురు అన్నదమ్ములతో కలసి సంతోషంగా ఆడుకుంటూ ఉంటాడు. కానీ సిరియా తిరుగుబాటులో జరిపిన వైమానిక దాడిలో వారు నివసించే భవనం ధ్వంసం అయింది. దానిలో ఒమ్రాన్ తోపాటు అతని తల్లిదండ్రులు అలాగే తన తోబుట్టువులు కూడా ఉన్నారు. సహాయక చర్యలు ప్రారంభించిన  స్థానికులకు మరియు పాత్రికేయులు ఒమ్రాన్ ను కాపాడారు. శిధిలాల నుండి బయటకి తీసిన తర్వాత ఒమ్రాన్ ని  స్థానిక పాత్రికేయుడు తీసిన ఈ ఫోటో అక్కడి బాల్యం ఎలా ఉందొ ఒక్కసారిగా ప్రపంచానికి తెలియజేప్పి ఉలుక్కిపడేలా చేసింది..

ఇంతకు ముందు సిరియా నుండి పరాయి దేశానికి ప్రాణాలను దక్కించుకోవటానికి వెళ్తున్న సమయంలో పడవ ప్రమాదంలో మరణించిన సిరియా బాలుడు అరియాన్ కుర్ది ఉదంతం మరువక ముందే మరోసారి అదే దేశంలో ఇలా జరగటం అందర్నీని కన్నీరు పెటిస్తుంది.

(Visited 49 times, 1 visits today)