Home / health / ఈతకెళ్తున్నారా? ఈ విషయాలు మరవద్దు.

ఈతకెళ్తున్నారా? ఈ విషయాలు మరవద్దు.

Author:

సమ్మర్ లో స్విమ్మింగ్(ఈత) ఒక మంచి ఎక్సరసైజ్ . దీని వల్ల బాడీ అండ్ మైండ్ చాల రిలాక్స్ అవుతాయి. సమ్మర్ హాలిడేస్ అనగానే పిల్లలని ఎదో ఒక ఆక్టివిటీ లో బిజీ చేయడం పేరెంట్స్ డ్యూటీగా మారింది. అందులో స్విమ్మింగ్ అంటే పిల్లలకి, పెద్దలకి ఇష్టమైన ఒక ఆట . ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి స్విమ్మింగ్ ఒక మంచి ఊరట, స్విమ్మింగ్ చేయడం వలన మన బాడీ ఉష్ణోగ్రత చాలా తగ్గుతుంది మరియు శరీరం కూడా ఫిట్ గా తయరవుతుంది. పైగా ఎన్ని ఎక్సరసైజ్ లు చేసిన స్విమ్మింగ్ చేసినంత సరదాగా ఉండదు. జిమ్ కెళ్లిన, వేరే ఏదైనా స్పోర్ట్స్ ఆడినా ఒళ్ళంతా చెమట పట్టి అలసిపోతాం కానీ స్విమ్మింగ్ మాత్రం అలసట తెలియనివ్వదు. ఒక ఆటవిడుపులా ఉంటుంది.

take hot shower after swimming

అయితే స్విమ్మింగ్ చేసిన తర్వాత గోరు వెచ్చని నీటి తో మాత్రమే స్నానం చేయాలట. ఎందుకంటే, స్విమ్మింగ్ వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది మరియు దానివల్ల ఆకలి పెరుగుతుంది. దీంతో ఇంటికి రాగానే ఎదో ఒకటి ఎక్కువగా తింటాం. కాబట్టి స్విమ్మింగ్ చేసిన వెంటనే గోరు వెచ్చటి నీతో తో స్నానం చేయడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతలు కూడా బాలన్స్ అవుతాయంటున్నారు పరిశోధకులు. జనరల్ గా స్విమ్మింగ్ పూల్స్ లోఎవరికీ ఎలాంటి ఇబ్బందులు, అలర్జీలు రాకుండా ఉండాలని క్లోరిన్ ని వాడుతారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల అది ఒంటిమీద ఉన్న క్లోరిన్ ని న్యూట్రలైజ్ చేస్తుంది .సింపుల్ గా చెప్పాలంటే వేడి నీరు క్లోరిన్ ని తినేస్తుందన్నమాట.. సో స్విమ్మింగ్ చేసాక మాత్రం గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం మాత్రం కాస్త సీరియస్ గానే తీస్కోండి. ఇది ఆరోగ్యానికే మంచింది.

(Visited 215 times, 1 visits today)