Home / Entertainment / షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన మరో యంగ్ హీరో

షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన మరో యంగ్ హీరో

Author:

shantanu injured in shooting

ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ కుమారుడు అయిన తమిళ యువ నటుడు శాంతను తాజాగా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనే సమయంలో అదుపు తప్పి కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. కేరళలో ఒక సినిమా షూటింగ్ లో భాగంగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో కిందపడటంతో తలకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన శాంతనును దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిస్థ అందించారు.

చికిత్స అనంతరం శాంతను మాట్లాడుతూ ‘సినిమా పరిశ్రమలో ఇలాంటివి సహజమేనని, తనకిప్పుడు ఫర్వాలేదని, ఇలాంటి స్టంట్స్ లో నిత్యం పాల్గొంటూ కష్టపడే స్టంట్ మాస్టర్స్ నిజంగా గొప్పవాళ్ళని, వాళ్ళకు నా సెల్యూట్’ అని తెలిపాడు. ఇక తను గాయపడిన విషయం తెలుసుకొని పరామర్శించిన అందరికి ధన్యవాదములు తెలిపాడు శాంతను. ఇటివలే యాంకర్ కీర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఇటీవల కాలంలో సినిమా షూటింగ్ సమయంలో వివిధ స్టంట్స్ చేస్తూ టాలీవుడ్ లో ఈ మధ్య ఇటీవల సుధీర్ బాబు మరియు ‘సుప్రీమ్’ సినిమా షూటింగ్ లో జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు, గాయపడిన సంగతి తెలిసిందే.

(Visited 89 times, 1 visits today)