Home / Political / ఇక ఎక్కువగా తాగినా పోలీసులే ఇంటికి చేరుస్తారట

ఇక ఎక్కువగా తాగినా పోలీసులే ఇంటికి చేరుస్తారట

Author:

Drinkers can get  ride back home

తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్‌శాఖ వినియోగదారుల క్షేమం కోసం సరికొత్త ప్రణాళికలను తయారు చేసి ప్రమాదరహిత ప్రయాణానికి బాటలు వేస్తున్నది. అంటే ఇదొక రకం డోర్ డెలివరీ అన్న మాట. బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లలో మోతాదుకు మించి మద్యం సేవించిన వారిని క్షేమంగా ఇంటికి చేర్చే ఆలోచన చేస్తున్నది. చిత్తుగా తాగి వాహనం నడిపి ప్రమాదాలు కొనితెచ్చుకునే వారిని దృష్టిలో ఉంచుకొని వారిని సురక్షితంగా ఇంటి దగ్గర దించేందుకు డ్రైవర్లను అప్పటికప్పుడు ఏర్పాటు చేస్తారన్న మాట. ఒకవేళ ఫుల్ గా తాగిన వ్యక్తికి కారు లేనట్టైతే టాక్సీని మాట్లాడి జాగ్రత్తగా ఇంటికి పంపిస్తారు. అంటే ఇక ఏ భయమూ లేకుండా మీరు బార్ లో మీకిష్టమొచ్చినంత తాగొచ్చు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచవచ్చు. తాగొద్దని చెప్పటం కాదు ఎంతైనా తాగండి అంటూ ప్రోత్సహిస్తున్నారు…

ఈ తరహా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు బార్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ళ యజమానులతో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశాలు కూడా నిర్వహించారు. ఇందులో పనిచేసే సప్లయర్స్‌కు శిక్షణ కార్యక్రమాలు కూడా ఇచ్చారు. మోతాదుకు మించి మద్యం తాగిన వారిని సురక్షితంగా గమ్యం చేర్చడం రెస్టారెంట్ల యజమానులు బాధ్యతగా తీసుకొని ముందుకు సాగితే తాగి వాహనం నడిపటం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టవచ్చని ఎక్సైజ్‌శాఖ ఆలోచిస్తోంది. ఈ మద్య సాధారణ పౌరులే కాదు మధ్య తరచూ టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖులు ఇలా తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడుతూనే ఉన్నారు. అయినా సరే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. మధ్యం సేవించి కారు నడపటం వారికి మాత్రమే కాదు. ఇతరులకూ ప్రమాదకరంగా మారుతోంది. అందుకే తాగిన వారికే కాదు రోడ్డు మీద ప్రయాణించే మిగతా పౌరులకూ ఏ ఇబ్బందీ కలగ కుండా ఈ ప్రత్యేక డోర్ డెలివరీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారట…

(Visited 312 times, 1 visits today)