Home / Political / ప్రభుత్వానికి ప్రజల కంటే బీర్ కంపనీలూ ముఖ్యమా?

ప్రభుత్వానికి ప్రజల కంటే బీర్ కంపనీలూ ముఖ్యమా?

Author:

water vs beer india

తెలంగాణ ప్రభుత్వానికి నీరు కన్నా బీరు ముఖ్యమైనదా? ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మంచినీరు లేక ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వం మాత్రం బీరు కంపెనీలకు మాత్రం నిత్యం మంజీర నీరు అందుతోంది. స్థానిక ప్రజల దాహార్తిని తీర్చడానికి నీటి పారుదల శాఖ మంత్రి హరీశరావు హైదరాబాద్‌కు మంజీర నీటి సరఫరాను నిలిపివేయించారు. కానీ అధికారులు మాత్రం ప్రజలకు నీరు అందిస్తే ఏమొస్తుంది బీరు కంపెనీలకు అందిస్తే వారికి మరియు ప్రభుత్వానికి డబ్బు వస్తుంది అనుకుంటున్నారో ఏమో..!

ఒక సారి బీరు ఎంతలో తయారు అవుతుందో, ప్రజల దగ్గరకు వచ్చేవరకు ఎంత అవుతుందో చూడండి. ఒక లైట్ బీరును ప్రభుత్వం 23 రూపాయల చొప్పున కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నది. ఇదే బీరును ప్రభుత్వం బ్రేవరేజ్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం షాపులకు రూ.71.50 పైసల చొప్పున అమ్ముతున్నది. ఈ బీరు బాటిళ్లపై బ్రాండ్లను బట్టి MRP ధర రూ.90 నుంచి రూ.95గా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్ట్రాంగ్ బీరు బాటిల్‌ను బ్రాండ్‌లను బట్టి రూ.25 నుంచి రూ.30 చొప్పున కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం బ్రేవరేజ్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం షాపులకు రూ.82కు విక్రయిస్తున్నది. ఈ బాటిళ్లపై బ్రాండ్లను బట్టి MRP ధర రూ.105 నుంచి రూ.120 ఉన్నది. అంటే ఒక్కో లైట్ బీరు బాటిల్‌పై రూ.48, స్ట్రాంగ్ బీరు బాటిల్‌పై సగటున రూ.60 చొప్పున ప్రభుత్వం ఆదాయం పొందుతున్నది. నెలకు కోట్లాది బీరు బాటిళ్ల అమ్మకం ద్వారా వేల కోట్ల రూపాయలను సమకూర్చుకుంటున్నది. అందుకే కాబోలు ప్రజలకు తాగునీటి కన్నా బీరును సరఫరా చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందన్న మాట!

(Visited 405 times, 1 visits today)