Home / Inspiring Stories / ‘ఊరిడిసి’ కాదు ఈ ప్రపంచాన్నే విడిసిపోయిన గూడ అంజయ్య.

‘ఊరిడిసి’ కాదు ఈ ప్రపంచాన్నే విడిసిపోయిన గూడ అంజయ్య.

Author:

ప్రముఖ కవి, గాయకుడు గూడ అంజయ్య గత కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో, కామెర్ల వ్యాధితో బాధపడుతూ… రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలంలోని రాగన్నగూడెంలోని తన స్వగృహంలో మరణించారు. అంజయ్య మరణం సాహితి లోకానికి తీరని లోటు ….

Guda-Anjaiah-Poet

గూడ అంజయ్య చేతిలో ఉన్న కాలం నుండి జాలువారిన ఎన్నో కథలు, పాటలు మన గుండెల్లో ఎప్పటికి నిలిచి ఉంటాయి. అంజయ్య లక్ష్మమ్మ, లక్ష్మయ్య దంపతుల ఐదుగురి సంతానంలో ఒకడిగా ఆదిలాబాద్ జిల్లా, దండేపల్లి మండలం, లింగాపురం గ్రామంలో 1955 లో జనమించాడు. ఇక తన ప్రస్థానం చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. చాలా చిన్నతనం నుండే పాటలు రాస్తూ వచ్చాడు. అలాగే ఎంత పేదరికం ఉన్న చదువును ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఫార్మసిస్ట్‌ స్థిరపడిపోయారు.

తెలంగాణ మలి ఉద్యమంలో అంజయ్య పాటలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క తూటాల్లా పేలాయి. అందులో ముఖ్యంగా “రాజిగ ఒరి రాజిగా”…అలాగే అంజయ్య రాసిన కొన్ని పాటలని ఆర్.నారాయణమూర్తి గారు తన సినిమాలలో వాడుకున్నారు అందులో కొన్ని …

  • నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు
  • జర భద్రం కొడుకో కొడుకో కొమరన్న
  • ఊరు మనదిరా ఈ వాడ మనదిరా
  • అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా?… లాంటి పాటలు ప్రజాధారణ పొందాయి.

ఇందులో ఊరు మనదిరా పాట 16 భాషల్లోకి అనువాదమైంది. ఆ పాట అప్పట్లో ఒక ఊపు ఊపింది…

అలాగే కొన్ని రచనలు కూడా చేసాడు అందులో ..పొలిమేర (నవల),దళిత కథలు (కథాసంపుటి)ఉన్నాయి.అంజయ్య కవిగా మనకు ఎంత తెలుసో మంచి మనసున్న మనిషిగా అంటే బాగా తెలుసు. ఎందుకంటే ఒక కవి గాని పాటగాడు గాని చాలా కోపంగా లేదా ఏదో ఒక అలజడి వారి మనసులో ఉంది తెలియని ఒక విచిత్ర అయోమయంలో ఉంటారు కవులు. కానీ మనకు అంజన్న ఎక్కువ తిరుగుబాటు పాటలు రాసిన చూడటానికి చాలా నెమ్మదస్తుడిగానే కనిపించేవాడు.తెలంగాణ ఉద్యమంలో భాగంగా ‘వాయిస్ ఆఫ్ తెలంగాణ’, ‘తెలంగాణ బుర్రకథ’ సీడీలను ఆవిష్కరించారు. సాహిత్య రత్న, దళిత కళారత్న, దళిత సేవారత్న వంటి అవార్డులను అందుకున్నారు.

(Visited 478 times, 1 visits today)