Home / Uncategorized / గ్రూపు-2 పరీక్ష రాస్తున్నారా? ఐతే ఈ నిభందనలు తెలుసుకోండి.

గ్రూపు-2 పరీక్ష రాస్తున్నారా? ఐతే ఈ నిభందనలు తెలుసుకోండి.

Author:

ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న గ్రూప్ -2 ఎగ్జామ్ కు సర్వం సిద్ధం చేసింది TSPSC. ఈ నెల 11,13 వ తేదీన జరుగునున్న గ్రూప్-2 ఎగ్జామ్ లో ఎలాంటి అక్రమాలు జరుగకుండా మునుపెన్నడూ లేని ప్రత్యేక చర్యలతోపాటు, ప్రత్యేక నిబంధనలు కూడా జారీచేసింది. ఆడవారి చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకున్న, షూ,ఆభరణాలు, సెల్ ఫోన్, బ్లూటూత్, ట్యాబ్లెట్, పర్సులు ఉంటే వారిని పరీక్ష హాల్ లోకి అనుమతించే ప్రసక్తే లేదని ప్రకటించింది. చివరికి నోట్లు, ఖాళీ కాగితాలు ఉన్న వారిని అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

group2-examinataion rules

పరీక్షకు హాజరయ్యే వారికి ఫొటో గుర్తిపు విధానాన్ని కచ్చితంగా అమలు చేయనున్నారు. అభ్యర్థులు వారి ఒరిజనల్ ఐడెంటిటీ కార్డు, పాస్ పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ ల్లో ఏదైనా ఒకటి తప్పని సరిగా తీసుకురావాలని వెల్లడించింది TSPSC. హాల్ టికెట్ లో ఫోటో సరిగ్గా లేనివారు తప్పనిసరిగా రెండు పాస్ ఫొటోస్ వెంట తెచ్చుకోవాలి. పరీక్ష జరుగుతున్న సమయంలో ఒకరికొకరు సమాధానాలను చెప్పుకున్నా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినట్లు తెలిసినా వారిపై కేసులు నమోదు చేసి భవిష్యత్ లో TSPSC నిర్వహించే ఎలాంటి పరీక్షలకు అనుమతించమని, వారిని రిజెక్ట్ లిస్ట్ లో పెడతామని స్పష్టం చేసింది.

TSPSC నిభందనలు:

  • చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకొని రాకూడదు.
  • సెల్ ఫోన్స్, బ్లూటూత్, పర్సులు పరీక్ష హాలులోకి అనుమతించరు.
  • షూ, సాక్స్ లు, ఆభరణాలు వేసుకున్న పరీక్ష హాలులోకి అనుమతించరు.
  • హాల్ టికెట్, ఏదైనా ఒక ఒరిజనల్ ఐడెంటిటీ కార్డు కచ్చితంగా తీసుకోని రావాలి.
  • అక్రమాలకు ఎవరు పాల్పడినా వెంటనే అభ్యర్థుల పేర్లను రిజెక్ట్ లిస్ట్ లో పెడతారు.
  • ఆన్సర్ షీట్ ను కేవలం బ్లాక్ లేదా బ్లూ పెన్ తో మాత్రమే నింపాలి, పెన్సిల్ తో నింపితే మీ ఆన్సర్ షీట్ చెల్లుబాటు కాదు.

అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి. మీ అందరికి మా telugu.alajadi.com తరుపున ఆల్ ది బెస్ట్

(Visited 1,219 times, 1 visits today)