Home / Entertainment / ‘బిగ్ బాస్-2’ సెట్ దగ్గర కౌశల్ ఆర్మీ రభస?

‘బిగ్ బాస్-2’ సెట్ దగ్గర కౌశల్ ఆర్మీ రభస?

Author:

113 రోజులు క్రితం మొదలైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కు విజేత ఎవరవుతారో అనే ఉత్కంఠకు ఈరోజు తో తెరపడనుంది..గత సీజన్ కు శివబాలాజీ విజేతగా నిలువగా, ఈ రెండో సీజన్ విజేత కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

హోస్ట్ నాని ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు అని చెప్పినట్లు…అనూహ్యమైన ట్విస్టులతో …షో సాగింది. బిగ్ బాస్ -2 లో ఒన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ కౌశల్ కు మద్దతుగా ఏర్పడిన `కౌశల్ ఆర్మీ`….ఏకంగా హైదరాబాద్ లో `కౌశల్ ఆర్మీ 2కె`నిర్వహించింది. దుబాయ్ లో ఆసియా కప్ సందర్భంగా కూఆ కౌశల్ కు మద్దతుగా బ్యానర్లు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్-2 విన్నర్ కౌశల్ అంటూ కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.

bigg-boss-2-telugu-winner-is-kaushal

ఇప్పటివరకు సోషల్ మీడియాకు పరిమితమైన కౌశల్ ఆర్మీ….శనివారం రాత్రి ఏకంగా అన్నపూర్ణలోని బిగ్ బాస్ సెట్ బయట హల్ చల్ చేశారు. 300 మంది కౌశల్ ఆర్మీ సభ్యులు …. ఫైనల్ షూట్ కు ముందు కౌశల్ కు మద్దతుగా నినాదాలు చేయడంతో బిగ్ బాస్ నిర్వాహకులు షూటింగ్ నిలిపివేశారట.

a

ఆదివారం సాయంత్ర ప్రసారం కానున్న గ్రాండ్ ఫినాలె షో ఎపిసోడ్ షూటింగ్ శనివారం రాత్రి ప్లాన్ చేశారు. కానీ దాదాపు 300 మంది కౌశల్ అభిమానులు బిగ్ బాస్ సెట్ వేసిన అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకుని…. కౌశల్ కు మద్దతుగా నినాదాలు చేశారని తెలుస్తోందా. కౌశల్ ….అంటూ పెద్దగా కేకలు వేసినట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ గోడలకు కౌశల్ విన్నర్ అంటూ పోస్టర్లు కూడా అంటించారట. దీంతో శనివారం రాత్రి షూటింగ్ ఆపివేసి….ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభించారట.

శనివారం రాత్రి కౌశల్ అభిమానుల అత్యుత్సాహం నేపథ్యంలో నేడు అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారట. మరోవైపు ఇప్పటికే కౌశల్ విన్నర్ అంటూ కౌశల్ ఆర్మీతో పాటు కొంత మంది సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నటి మాధవిలత – నటుడు అభి తన ఫేస్ బుక్ ఖాతాలో కౌశలే విజేతగా నిలిచాడు అని పోస్ట్ చేశారు. ఫైనల్ ట్రోఫీ అందించడానికి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేశ్ హాజరవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. ఫైనల్కు కౌశల్ తో పాటు గీతా మాధురి – దీప్తీలు చేరినట్లు సమాచారం. మరి అసలు విన్నర్ ఎవరో తెలియాలంటే మరి కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.

(Visited 1 times, 1 visits today)