Home / Entertainment / పవన్ కళ్యాణ్ కోసం గుడి కట్టిస్తా అంటున్న శంకర్.

పవన్ కళ్యాణ్ కోసం గుడి కట్టిస్తా అంటున్న శంకర్.

Author:

Temple for powerstar pawankalyan

ఇప్పుడు ఏకంగా ఒక యంగ్ కమెడియన్ పవన్ కు గుడి కట్టిస్తాను అంటున్నాడు నిన్న రాత్రి ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన ఒక ప్రవాస భారతి కార్యక్రమంలో తాను లేటెస్ట్ గా నటించిన ‘రాజు గారి గది’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసాడు షకలక శంకర్.

ఇప్పుడు ఏకంగా ఐ యంగ్ కమెడియన్ పవన్ కు గుడి కట్టిస్తాను అని ఒక ఛానల్ సాక్షిగా తెలియ చేశాడు . అతడు ఎవరో కాదు షకలక శంకర్. అమెరికా నుండి ఫోన్ చేసిన ఒక అభిమాని ఈ హాస్య నటుడితో మాట్లాడుతూ పవన్ తో ఎప్పుడు నటించ బోతున్నావు అని అడిగినప్పుడు భావోద్వేగంతో షకలక శంకర్ పవన్ తో నటించే అవకాశం గురించి ఎదురు చూస్తున్నాను అని అనడమే కాకుండా తాను త్వరలో పవన్ కళ్యాణ్ కు గుడి కడతాను అన్న సంచలన విషయాన్ని బయట పెట్టాడు. ఒక ప్రముఖ ఛానల్ చాల కాలంగా ప్రసారం చేస్తున్న ‘జబర్దస్త్’ కార్యాక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన షకలక శంకర్ తన మొట్ట మొదటి కామెడీ స్కిట్ ను పవన్ ను అనుసరిస్తూ ‘జబర్దస్త్’ కార్యక్రమంలో చేసాడు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఇదివరకూ ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలో కొందరు వీరాభిమానులు పవన్ కు ఒక గుడి కట్టించాలి అన్న ప్రయత్నం చేసి పవన్ వైపు నుంచి చివాట్లు రావడంతో ఆ ప్రయత్నాన్ని ఆపి వేసిన సంగతి తెలిసిందే.

(Visited 152 times, 1 visits today)