Home / Inspiring Stories / తనకు వచ్చిన ప్రైజ్ మనీని బడికి విరాళంగా ఇచ్చిన పారాలింపిక్ విజేత తంగవేలు.

తనకు వచ్చిన ప్రైజ్ మనీని బడికి విరాళంగా ఇచ్చిన పారాలింపిక్ విజేత తంగవేలు.

Author:

ఒక పేదోడి కష్టం మరో పేదోడికి తెలుసు అంటారు, పారాలింపిక్స్‌‌లో బంగారు పతాకం సాధించి దేశ ప్రతిష్టను మరింత పెంచిన క్రీడాకారుడు మరియప్పన్ తంగవేలు. చిన్నతనం నుండి కష్టాలనే ఇష్టంగా చేసుకొని, కష్టాలనే తన జీవితం అనే విధంగా బ్రతికిన తంగవేలు తాను సాధించినది బంగారు పతకమే కాదు తానూ కూడా బంగారమే అని నిరూపించుకున్నాడు.

tangavelu-donation-to-his-school

తంగవేలు తన రాష్ట్రం ప్రకటించిన 2 కోట్లలో తనకు  చదువు చెప్పి విజ్ఞానం అందించిన ప్రభుత్వ పాఠశాలకు 30 లక్షలు విరాళం ప్రకటించాడు. తంగవేలు ఎంతో కష్టపడి .. ఆకలితో ఎన్నో నిద్రలేనిరాత్రులు గడిపాడు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. కనీసం సరైన షూ లేకుండా ప్రాక్టీస్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా తన జీవితంలో అనుభవించిన  కష్టాల ముందు ఈ కష్టాలు నిలువలేదు అందుకే బంగారం పతకం  తన మెడలో ఒక పూలదండలాగా మారింది.

మన ప్రభుత్వాలు వెండి, కాస్య పతకాలకే కోట్లు,కోట్లు విరాళాలు ప్రకటిస్తూ వచ్చారు. వారికి ఉండటానికి ఇల్లు, తిరగటానికి కార్లు, భ్యాంక్ లో సరిపోయే డబ్బు ఇచ్చారు కానీ పేదరికం నుండి వచ్చి తనకు ప్రకటించిన డబ్బులో తన చుట్టూ ఉండేవారి జీవితంలో వెలుగు నింపే పాఠశాలకు విరాళం ప్రకటించడంతో తంగవేలు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

(Visited 5,981 times, 1 visits today)