Home / Entertainment / “సైన్మా” చూపిస్తా అంటున్న పెళ్లిచూపులు డైరెక్టర్.

“సైన్మా” చూపిస్తా అంటున్న పెళ్లిచూపులు డైరెక్టర్.

Author:

తరుణ్ భాస్కర్ ‘పెళ్లిచూపులు’ అంటూ చిన్న సినిమాని పెద్ద హిట్ చేసి పరిశ్రమలో అందరికి తానేంటో తెలిసేలాగా చేసుకున్నాడు. ఇప్పుడు తరుణ్ కి చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ అవన్నీ కాదనుకొని మరో చిన్న సినిమాను చెయ్యనున్నాడు అదే ‘సైన్మా’. అదేంటి ఈ పేరు మీద ఎప్పుడో షార్ట్ ఫిల్మ్ తీశాడు కధ తరుణ్ అనుకుంటున్నారా! .అవును  తరుణ్ కి చాలా మంచి పేరు తీసుకొచ్చిన షార్ట్ ఫిల్మ్ ‘సైన్మా’. అందుకే ఆ సినిమాని పెద్ద సినిమాకు సరిపడేలా స్టోరీని సరిచేస్తున్నాడట. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా, పక్కింటిటి కుర్రాడి కథనో , లేక మన కథనో  అనిపిస్తుంటుంది. ఈ సమయంలో పెద్ద హీరోలతో పోకుండా తనకంటూ ఒక సపరేట్ రూట్ వేసుకుంటూ పోబోతున్నాడు ఈ కుర్ర డైరెక్టర్.

sainma malli tistanantunna tarun bhaskar

తరుణ్ మొదటి సినిమాగా సుమారు కోటిన్నర బడ్జెట్‌లో తెరకెక్కిన ‘పెళ్లిచూపులు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బడ్జెట్‌కు ఎన్నోరెట్లు మించి వసూళ్ళు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అమెరికాలో 1 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఈ సినిమా సాధించిన అతిపెద్ద విజయంగా పేర్కొనవచ్చు. అదే విధంగా మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడు సినిమా ను ఆదరిస్తారని మరోసారి నిరూపితమైంది. ఈ సంధర్భంగా తరుణ్ కి మరిన్ని మంచి విజయాలు దక్కాలని ఆశిద్దాం. ఇంతకీ తరుణ్ తీసిన “సైన్మా” షార్ట్ ఫిల్మ్ చూడని వారు ఇక్కడ చూసెయ్యండి.

(Visited 148 times, 1 visits today)