Home / Inspiring Stories / ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?

ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?

Author:

”అల‌హాబాద్‌లో మాది చాలా పేద కుటుంబం. హై స్కూల్ వ‌ర‌కు నాన్న న‌న్ను బాగా చ‌దివించారు. అయితే నా చ‌దువు కోసం వారు త‌మ ఆహారాన్ని కూడా తినేవారు కాదు. అలా ఆదా చేసిన డ‌బ్బుతో న‌న్ను చ‌దివించేవారు. కానీ అది నాకు న‌చ్చ‌లేదు. వారు నా కోసం చేస్తున్న త్యాగాన్ని భ‌రించ‌లేక‌పోయా. వెంట‌నే ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చా. ముంబై చేరుకున్నా. అక్క‌డ మా అక్క ఉండేది. ఆమె వ‌ద్ద ఉండేవాన్ని. అప్పుడు 1990. ఆ సంవ‌త్స‌రం నుంచి ముంబైలో క్యాబ్ న‌డ‌ప‌డం మొద‌లు పెట్టా. అలా చాలా ఏళ్లు గ‌డిచాయి. కానీ ఇన్నేళ్ల‌లోనూ నేను ముంబై వాసుల ప్రేమ‌ను, ఆప్యాయ‌త‌ను అందుకున్నా. అందుకు ఉదాహ‌ర‌ణే ఈ ఘ‌ట‌న‌.

ముంబైలో క్యాబ్ డ్రైవ‌ర్‌గా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నా. అయితే చాలా ఏళ్ల‌కు గానీ మాకు పిల్లలు పుట్ట‌లేదు. పిల్ల‌లు క‌ల‌గ‌క‌పోయే సరికి బాధ‌ప‌డ్డా. అయితే ఓ రోజున నా క్యాబ్‌లో ఓ యువ‌తి ఎక్కింది. ఆమెతో నా విష‌యాన్ని చెప్పా. అనేక సంవ‌త్స‌రాలు అవుతున్నా నా భార్య‌కు గ‌ర్భం రావ‌డం లేదు ఎందుక‌ని ఆమెను అడిగా. అందుకామె బ‌దులు చెప్పింది. త‌న మామ ఒక‌రు డాక్ట‌రట‌. ఆయ‌న్ను క‌లిస్తే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని ఆమె చెప్పే సరికి అలాగే చేశా. ఆశ్చ‌ర్యం. త‌రువాత కొన్ని నెల‌ల‌కు నా భార్య గ‌ర్భం దాల్చింది. పండంటి మ‌గ పిల్లాడికి జ‌న్మ‌నిచ్చింది. దీంతో ఆ యువ‌తికి థ్యాంక్స్ చెప్పా. అప్పుడే అనుకున్నా న‌న్ను ఆద‌రించి, నా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన ఆ ముంబై వాసి స‌హాయానికి గుర్తుగా ఇత‌ర ముంబై వాసుల‌కు స‌హాయం చేయాల‌ని అనుకున్నా. అలాగే చేయ‌డం మొద‌లు పెట్టా.

ఓ రోజున ఇద్ద‌రు యువ‌కులు నా క్యాబ్‌లో రాత్రి పూట ఎక్కారు. వారు బాగా తాగారు. ఇంట్లో దింప‌మ‌ని అడిగారు. వారి ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్లా. అయితే తీరా దిగాక చార్జిలో రూ.100 త‌గ్గింది అని చెప్పారు. అయితే నేను ఏం ఫ‌రవాలేదు, మీరు సేఫ్ గా ఇంటికి వ‌చ్చారు, అది చాలు. అని చెప్పి అక్క‌డి నుంచి వెళ్లిపోయా. అప్ప‌టి నుంచి రాత్రి పూట నా క్యాబ్‌లో అలా ఎవ‌రో ఒక‌రికి స‌హాయం చేస్తున్నా. నా బాధ్య‌త‌గా నేను రోజూ అలా క్యాబ్ అవ‌స‌రం ఉన్న వారిని ఇంట్లో దిగ‌బెడుతున్నా. ఈ తృప్తి చాలు నాకు. ముంబై న‌న్ను చేర‌దీసి నాకు ఉపాధి ఇచ్చింది. నా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపింది. అంత‌కంటే నేను తిరిగివ్వ‌డానికి నా ద‌గ్గ‌ర ఏమీ లేదు. అందుకే ఇలా ముంబై వాసుల‌కు స‌హాయం చేస్తున్నా..!”

— ముంబైకి చెందిన ఓ క్యాబ్ డ్రైవ‌ర్ య‌దార్థ జీవిత గాథ ఇది. రియ‌ల్ స్టోరీ..!

(Visited 1 times, 1 visits today)