Home / Inspiring Stories / “ద అదర్ పెయిర్” ఒక అద్బుతమైన షార్ట్ ఫిలిం.

“ద అదర్ పెయిర్” ఒక అద్బుతమైన షార్ట్ ఫిలిం.

Author:

ఒక చిన్న సంఘటన,కొన్ని సెకెన్లలోనే మనిషి చేసే పని మన గుండెలని తాకుతుంది. అత్యద్బుతమైన పనులు చేసేందుకు సంవత్సరాలకు పైగా వయసుండాల్సిన పని లేదు. తన లాంటి మనిషి పడే వేదనని గుర్తించ గలిగితే చాలు. “కాళ్ళు లేని మనిషిని చూసే వరకూ నా కాళ్ళకి చెప్పుల్లేవని ఏడుస్తూనే ఉన్నాను” అన్న ఒక మాటని వినే ఉంటారు కద్దా..! ఈ వీడియో లో కనిపించే ఇద్దరు పిల్లల సమస్యా… మొదటి పిల్ల వాడి కళ్ళలో ఒక్క క్షణం అసూయా… అయినా మళ్ళీ తన చెప్పు తెగిపోయిందన్న విషయాన్ని మర్చిపోయి రెండో వాడికి జారిపోయిన షూ అందించటం కోసం పడ్డ తపనా… మనలో ఎక్కడో ఉన్న సిన్నితత్వాన్నీ తట్టిలేపుతుంది… అంతలోనే రైల్లో ఉన్న రెండో పిల్ల వాడు చేసిన పనికి ఒక్క సారి కళ్ళు ఆర్థత తో చెమరుస్తాయి….

అనెదర్ పెయిర్ అనే ఈ నాలుగు నిమిషాల షార్ట్ ఫిలిం మీలో రొటీన్ జీవితం తో విసిగి పోయిన నిజమిన మనిషిని నిద్ర లేపుతుంది. ఆ ఇద్దరు పిల్లలనీ ఒక్క సారి హత్తుకొని. “జీతేరహో బేటా” అంటూ మెచ్చుకోవాలనిపిస్తుంది. ఈ ఈజిప్షియన్ షార్ట్ ఫిలిం మనం చిన్నప్పుడు విన్న ఘాందీ కత ఆధారంగా తీయబడిందట. రైల్లోంచి తన చెప్పు జారిపోగానే రెండో చెప్పుని కూడా కావాలని వదిలేసారట గాంధీ… ఎందుకలా అని పక్క నున్న వాళ్ళు అడిగితే “ఒక్క చెప్పు నాకెటూ పనికి రాదు కానీ రెందు చెప్పులూ లేని వాడికి పనికొస్తాయ్ కదా” అన్నారట గాంధీ. అదె సంఘటనతో వచ్చీన ఆలోచనే ఈ “ద అదర్ పోయిర్” అనే షార్ట్ ఫిలిం కి మూలం. ఒక సారి చూడండీ వీడియోని….

(Visited 399 times, 1 visits today)