Home / Inspiring Stories / తిరుపతిలో మీరు చూడవలసిన మరిన్ని ఆలయాలూ.

తిరుపతిలో మీరు చూడవలసిన మరిన్ని ఆలయాలూ.

Author:

తిరుపతి భారతదేశంలోని పవిత్ర యాత్రా స్థలాల్లో ఒకటి..అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు కేవలం ఏడుకొండల మీద ఉన్న వేంకటేశ్వరున్ని మాత్రమే దర్శించుకుంటే చాలా…!? ఆ మహిమాన్విత ప్రదేశంలో మీరు దర్శించాల్సిన ప్రదెశాలు మరెన్నో ఉన్నాయి. కలియుగ దైవం చుట్టూ ఎన్నో మరెన్నో దర్శనీయ ప్రదెశాలూ,ప్రకృతితో మమేకమయ్యి విశ్వామంతానిండి ఉన్న ఆ మహా రూపానికి దగ్గరగా మనలని తీసుకు వెళ్ళిన అనుభూతినిచ్చే ప్రదెశాలూ ఉన్నాయి…. ఈ సారి వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలకూ వెళ్ళిరండి….

శ్రీ తిరుచానూరు:

Tiruchanoor-temple

అలిమేలు మంగమ్మ పుట్టిల్లు ఈ ఊరేనట. దీనిని అలమేలు మంగా పురమని కూడ అంటారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీ దేవి అవతారమైన అలమేలు మంగమ్మ కొలువై ఉంటుంది. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఈ ఆలయమే అమ్మవారి జన్మస్థలం.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. పదివేల జనాభా మాత్రమే ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం:

Govinda-Raju-swami-temple 1

గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి పట్టణంలో ఉన్న ఒక ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషను సమీపంలోనే, కోనేటి గట్టున ఉంది. ఇక్కడ కొలువైన దేవుడు గోవిందరాజ స్వామి. ఈయన శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) సంస్థ నిర్వహణలోవే ఉంది.

తిరుపతి ఇస్కాన్:

Iskcon-tirupati

తిరుపతి పుణ్య క్షేత్రములో, కపిలతిర్థమ్ జలపాతం ఉన్న ప్రాంతమునకు దగ్గరలో ఇస్కాన్ కృష్ణ దేవాలయము ఉన్నది. ఇక్కడ ఈ ఆలయము హరేకృష్ణ ఆలయముగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయమును చాలా శ్రమపడి అందముగా తీర్చి దిద్దారు. ఆలయము చుట్టూ పచ్చిక బయళ్ళు తయారు చేసి సందర్శకులకు చూడచక్కని ప్రదేశముగా తయారు చేశారు. తిరుపతి రైల్వే స్టేషను నుండి ఆటోలో ఈ దేవాలయమునకు వెళ్ళవచ్చును. తిరుమల తిరుపతి దేవస్థానము వారు ప్రతి రోజూ ఆలయ దర్శనము యాత్రలో ఈ అలయాన్ని చూపిస్తారు.

శ్రీనివాస మంగాపురం:

Sri-kalyana-venkateshwara-temple 1

సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరుడే పద్మావతీ సమేతంగా ఇక్కడ నివసించారని స్థలపురాణం చెబుతుంది. శ్రీనివాస మంగాపురం తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనం లో కళ్యాణం చేసుకొని, తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇక్కడ కాలం గడిపారు.

వరాహస్వామి ఆలయం:

sri-aadhi-varahaswami-temple 1

తిరుమల ఉత్తరమాడ వీధిలో వుంటుంది. మొదట వరహస్వామిని దర్శించి ఆ తర్వాత శ్రీవారిని దర్శించాలని స్థల పురాణం చెపుతోంది.

కపిల తీర్థం:

kapila-theertham 1

తిరుమలకు వెళ్ళే దారిలోనే వచ్చే ప్రదేశం ఇది దీన్ని చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది ‘కపిలలింగం’గా పేరొందింది. త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా ‘ఆగ్నేయలింగం’ అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.

జపాలి తీర్థం:

Japali-theertham 1

జపాలి మహర్షి శ్రీ ఆంజనేయుని అనుగ్రహం తో శ్రీ రాముని దర్శనం కోరి గొప్ప తపస్సు చేసిన ప్రదేశమిది . శ్రీ తిరుమల శ్రీ వారి ఆలయానికి అతి దగ్గరలో ఉంది . జపాలి మహర్షి కి దర్శనమిచ్చిన ఆంజనేయ స్వామి విగ్రహం స్వయంభువు అని అంటారు. జాపాలి తీర్థం లో స్నానం చేసిన భక్తులు పాపాల నుంచి విముక్తి అవుతారు అని పురాణం గాథ .

హథీరాం బావాజీ మఠం:

Hethuram Baba

శ్రీవారి ఆలయం ఎదురుగా వుంటుంది. ఆరోజుల్లో హథీరాం బాబా అనే భక్తుడొకరు స్వామివారితో తిరుమల వచ్చి పాచికలాడేవాడట. ఒకరకంగా ఈయన ఆ వేంకటేశ్వరుడికి ప్రియ మిత్రుడు కూడా.. ఆయన ఆనాటి నివాస స్థలం ఇది. .

శ్రీ పరశురామేశ్వర ఆలయం:

sri-parushurameshwara-temple-2

రేణి గుంటకు ఏడు కిలో మీటర్ల దూరం లో సువర్ణ ముఖీ నదీ తీరం లో ఉన్న గుడిమల్లం గ్రామంలో ఒకటవ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయం ఇది. దీనిని శ్రీ పరశురామాలయం అనికూడా అంటారు .అత్యద్భుత శిల్ప శోభితమైన ఈ ఆలయం చాలాకాలం కాల గర్భం లో కలిసి పోయి వెలుగు లోకి వచ్చింది.ప్రపంచం లో ఎక్కడా లేని విధం గా ‘’పురుష లింగాన్ని’’ పోలి ఉండే ఏడు అడుగుల శివలింగం పై ఒక చేత్తో పరశువు, మరో చేతిలో గొర్రె పొట్టేలు పట్టుకొని యక్షుని భుజాలపై నిలబడి న రుద్రుని రూపం దర్శనమిస్తుంది.

(Visited 3,514 times, 1 visits today)