Home / Inspiring Stories / ఆడవాళ్ళు దేనికి తక్కువ కాదు అని నిరూపించిన రూబీ.

ఆడవాళ్ళు దేనికి తక్కువ కాదు అని నిరూపించిన రూబీ.

Author:

AUTO GIRL

మహిళా సాధికారత మనదేశం లో అందని పండుగా మిగిలింది అనే వారికి తానే సమాధానమైంది ఒక మహిళ. మహిళకి సమాన స్థాయి అనేది ఎవరో ఇచ్చేది కాదని తనకు తానుగా నిరూపించుకోవాలనీ చెప్తూ ఆరు సంవత్సరాలుగా ఆటో డ్రైవర్ గా తన కెరీర్ ని కొనసాగిస్తోంది నోయిడాకి చెందిన రూబీ సింఘాల్ .. ఎన్నో సంవత్సరాలు గా మగవాళ్ళు మాత్రమే చేసే పనిని తాను ఒంటరిగానే చేస్తోంది ఈ 30యేళ్ళ అమ్మాయి. ఆడ వాళ్ళకి రక్షణ కరవైందంటున్న నోయిడా గజియా బాద్ లలో తాను ఆటో డ్రైవర్ గా పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తోంది.

తన కుటుంబ సభ్యులు మొదట ఆమె ఆటో డ్రైవర్ గా మారటాన్ని ఇష్టపడలేదట. ఆమె తండ్రైతే ఏకంగా ఇంట్లోకే రావొద్దంటూ హుకుం జారీ చెసాడట. ఐనా రుబీ సింఘాల్ తన నిర్ణయాన్ని మర్చుకోలేదు తన భర్త ని నెమ్మదిగా మార్చుకొని అతనికి అర్థం అయ్యేవిధంగా సర్ది చెప్పుకొని మరీ ఈ రంగం లో కి వచ్చి… తన కుటుంబ బాధ్యతలకు ఆర్థికం గా సహకారాన్ని అందిస్తోంది “ఎంతో కాలం గా మగవారు మాత్రమే చేసే ఈ పనిలో ఒక మహిళ అయిన నన్ను చూసి చాలామంది ఆశ్చర్య పోయారు, కానీ నన్ను చూసి అభినందించిన వారే ఎక్కువ. మా నాన్న నేనీ రంగం లోకి వచ్చినప్పుడు చాలా అవమానంగా అనుకున్నారు నన్ను ఇంటి గడప తొక్క వద్దని కూడా అన్నరు కానీ నాకు నా భర్త కి సహకరించటానికి మరో మార్గం కనిపించలేదు. నా సొదరుదు అందిన సహకారం తోనే నేను కొత్త ఆటో కొనుక్కున్నాను మేం ఎంతో ఆనందం గా ఉన్నాం కూడా” అని చెప్తోందీ అమ్మాయి..

ఈ ఆరేళ్ళలో తాను ఎంతో నేర్చుకున్నాననీ కొన్ని సార్లు విపరీతమైన వివక్షణీ ఎదుర్కున్నానని చెప్తూన్న రూబీ తనకు ఎదౌరయ్యే సవాళ్ళని ఎదుర్కోవటానికి తన భర్తా, సోదరుల సహకారాన్నీ మరువలేనంటోంది ఇప్పుడు కొస మెరుపేమిటంటే ఈ ఆరేళ్ళలో తనని చూసి డ్రైవింగ్ లోకి వచ్చి స్కూల్ బస్ లనీ,కాబ్ డ్రైవింగ్ నీ కెరీర్ గా ఎంచుకున్న ఇతర ఆడపిల్లలు రుబీనే తమ ఆదర్శం అని చెప్పటం…

(Visited 132 times, 1 visits today)