Home / Inspiring Stories / తండ్రికిచ్చిన మాటకోసం సాఫ్ట్ వేర్ జాబ్ వదిలి పోలీస్ కానిస్టేబుల్ అయ్యాడు.

తండ్రికిచ్చిన మాటకోసం సాఫ్ట్ వేర్ జాబ్ వదిలి పోలీస్ కానిస్టేబుల్ అయ్యాడు.

Author:

Software Engineer Became as Police Constable

అతనొక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రైడర్ సాఫ్ట్ వేర్ అనే పెద్ద కంపెనీలో రెండేళ్ళ పాటు పని చేసాడు లక్షల్లో జీతం,అక్కడి నుంచి ఐఎంజీ వైశ్యాబ్యాంక్ లో చేరాడు. దాదాపు ప్రతీ ఒక్కరూ కోరుకునే జీవితం, అవసరాలకు మించిన డబ్బు వచ్చే జాబ్,హోదా అన్నీ వచ్చి చేరే సమయంలో అక్కడా మానేసాడు. ఈసారి కొత్త ఉధ్యోగాన్ని ఎన్నుకున్నడు సాధించాడు ఐతే ఆ ఉధ్యొగం ఏమిటో తెలుసా పోలీస్ కానిస్టేబుల్….

తన తండ్రి కోరిక మేరకే తానీ జాబ్ ని ఎన్నుకున్నాననీ దీనివల్ల తన జీవితంలో ఆనందం పెరిగిందే తప్పతగ్గలేదనీ అంటున్నాడీ సాఫ్ట్ వేర్ పోలీస్. కిడ్నీ ఫెయిల్యూర్ తో తన తండ్రి అడిగిన మాట కోసం తన కెరీర్ నే వదులుకున్నాడితను. ఇంతకీ ఈ పోలీస్ పేరేంటో తెలుసా రూపేష్ కుమార్ పవార్. తన తండ్రీ తల్లీ మాత్రమే కాదు అతని అన్నా చెల్లీ కూడా పోలీస్ ఫోర్స్ లోనే ఉన్నారు. అందుకే అతని తండ్రి ” సంపాదించే వాడిగా కాదు సమాజానికి ప్రత్యక్షంగా పనికొచ్చే వాడిలా ఉండగలవా” అని అడిగినప్పుడు ఆయన మాట కాదనలేకపోయాడట.ట్రాఫిక్ పోలీస్ గా ఒక ఖరీదైన కుర్రాడితో జరిగిన సంభాషణ మనల్ని ఆలోచింపజేసేలానూ ఉంటుంది. ఇలా తన జాబ్ తనకు సంతృప్తినిచ్చిందనే అంటున్నాడు రూపేష్..

మొదటి సారి తన కి కాబోయే భార్యతో మాట్లాడినపుదు నేనొక పోలీస్ కానిస్టేబుల్ ని అని చెబితే ఆశ్చర్య పోయిందట. నీ ఇంగ్లిష్ చూస్తే పెద్ద చదువు చదివినట్టున్నావ్ అన్నప్పుడు తన చదువూ,పాత జీవితంతో పాటు తను పోలీస్ అవటానికి కారణం కూడా చెప్పాడట.ఆమె వెంటనే పెళ్ళీకి ఒప్పుకుంది.ఇప్పటికీ చిన్న ఇంటిలో ఉంటూ వర్షాకాలం వస్తే కారుతున్న ఇంట్లో ఒకే ఒక గదిలో కి కుటుంబం అంతా వెళ్ళి ఉండాల్సి వచ్చినా… తన జీవితం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు రూపేష్ భార్యా కుటుంబ సభ్యులూ…. కింద వీడియోలో అతని అనుభవాలని అతని మాటల్లోనే వినండి…

(Visited 1,939 times, 1 visits today)