Home / Inspiring Stories / విచిత్రవంటకంబు వింతైన భోజనంబు…!

విచిత్రవంటకంబు వింతైన భోజనంబు…!

Author:

రెస్టారెంట్ల wirest foods in aisa

మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? ఒక వేళ నాన్ వెజ్ ఐతే వండిన మాంసం తింటారా పచ్చిదేనా? మీకు బొద్దింకల పులుసు ఇస్టమేనా లేదంటే కాల్చిన స్టఫ్డ్ ఎలక తింటారా? ఆగండాగండి మొహం అలా పెట్తొద్దు..ప్రపంచ దేశాల్లోని కొన్ని రెస్టారెంట్ల లోని వంటలెలా ఉంటాయో చెప్పబోతున్నాం… చూసి లొట్టలేయాలంతే ఆనక మాకూ అవి కావాలని అడగకూడదు.. మీ ఇంట్లోనే యమీ…యమీ.. అని వొండుకు తింటే మేమేమీ వద్దనం లెండి.. ఆ ఒక్క రోజు మమ్మల్ని భోజనానికి పిలవకుంటే చాలు….

బలుట్: ఎప్పుడైనా ఆగ్నేయాసియా వైపు వెళితే అక్కడ రెస్టారెంట్ వాడు మీకిచ్చిన మెనూలో “బలుట్” అనే పేరు ఆ డిష్ ఫొటో (చిన్నది కద) ఫొటో నచ్చిందని వెంటనే  ఆర్డర్ చేసేయకండి అసలదేంటో వాన్ని అడగాలి ముందు.. వాడు చెప్పెది అర్థమౌతుందో లేదో నేనే చెప్తానుండండి.. బలూట్  అంటే ఉడక బెట్టిన బాతు గుడ్డు ఓ అస్ ఇంతేనా అనేస్తున్నారా… ఆగండాగండి బాతు గుడ్డు వరకూ ఓకే గానీ అందులో అప్పుడప్పుడే తయారౌతున్న లేత బాతు పిల్ల ఉంటుందంతే..సాధారణం గా 17 రోజుల పిల్ల గుడ్డునే సర్వ్ చేస్తారట ఐతే ఎక్కువమంది కొద్దిగా ఎముకలొచ్చిన 20-22 రోజుల పిల్ల గుడ్డునే అడుగుతారట..

duck egg

మంగోలియన్ బూర్జ్: మన అందా బుర్జీ లాగే చక్కటి పేరున్న ఈ రుచికరమైన మంగోలియన్ వంటకం చాలా ప్రసిద్ది చెందింది చైనా లోని కొన్ని రెస్టారెంట్ల లో చాలా క్రేజీ ఆర్డర్ గా పేరు తెచ్చుకుంది కూడా.   గొర్రె లేదా మేకని కోసిన తర్వాత దానిలోని ముఖ్యమైన భాగాలను (గుండే, కాలేయం, కిడ్నీ లాంటివి)  కొన్ని మసాలాలను వేసి కూరతారు.. ఆతర్వాత మంటలో బాగా కాలిన బండరాళ్ళని ఆ పొట్టలోనే వేసి కుట్టేస్తారు. ఆ రాళ్ళవేడీకి లొపల మాంసం ఉడుకుతోంటే పైనుంచి ఆ చర్మం మీది రోమాలన్నీ కాలిపోయే లా కాలుస్తారు.ఇక ఆ “పార్సెల్” అలానే మీటేబిల్ మీదికి వచ్చేస్తుంది ఒక చాకూ…ఫోర్కూ…ఆతర్వాత మీ దిల్ మాంగే మోర్ (వాష్బేసిన్స్)
goat

వెయ్యేళ్ళ గుడ్డు: మరీ వెయ్యేళ్ళు కాదు కాదు గానీ అ ఒకటీ రెండేళ్ళదన్న మాట.. ముందుగా గుడ్డు తీసుకొని (కోడిదే లెండీఅ ఏ పాముదో అని అనుకోవద్దు చైనీ ఆర్ నవ్ సో డెవెలప్డ్ డ్యూడ్) ఉప్పూ, బంకమట్టీ, తవుడూ, క్విక్లైం లను కలిపిన ముద్దలో పెట్టి కొన్ని నెలల పాటి అలా ఊరబెడతారు.. అప్పుదు ఆ గుడ్డు చాలా శక్తులని పొందుతుందట. “ఆ.. గాడిద గుడ్డు..!” అని మీరన్నా చైనీయులు మాత్రం లొట్టలేస్తూ ఈ వెయ్యెళ్ళ గుడ్డుని రకరకాలుగా వండి తింటారు

1000 years egg

ఎస్క మోల్: ఇదీ మెక్సికన్ గుడ్డుకర్రీ నే కాకుంటే ఆ గుడ్లు చీమవి. ఔను మీరు విన్నది నిజమే అక్కడి అడవుల్లో కొన్ని రకాల గండు చీమలు కనీసం మిరియాలంత సైజున్న గుడ్లుపెడతాయ్ మరి.. వీటిని వండిన స్థానిక ఆకు కూరలతో కలిపి (గుడ్లు పచ్చివే వండేది ఓన్లీ ఆకు కూరనే) బీరుతో వడ్డిస్తారట… (ఐనా ఇదేం గొప్ప మన సీకాకుళం లో ఎర్ర చీమల పచ్చడి తెనలేదా ఏమిటి)

eggs

త్యూనా ఐబాల్: ఐబాల్ అంటే అర్థమింది కదా ట్యూనా ఫిష్ కనుగుడ్డు మనలో చాల మందే తిని ఉండొచ్చు. కానీ…!జపాన్ వాళ్ళు ఏం చేసినా ఫ్రెష్ గా ఉంటుంది అందుకే ఎంచక్కా పచ్చి కనుగుడ్డే ఇచ్చేస్తారు.

egg

బ్యాట్ సూప్: గబ్బిలపు పులుసు (వింటేనే డోకొచ్చేసింది) మీరేం ఇదవ్వకండి.. చైనా సూపర్ సూప్స్ లో ఈ బ్యాట్ సూప్ అంటే పడి చచ్చిపోతున్నారట.. (నిజమే తింటే మనం మాత్రం బతికుంటామా ఏమిటీ)
bat soup

ఒకప్పుడు జర్మనీ, ఆస్ట్రేలియాల్లో ఈ డిష్ బాగానే దొరికేది ఇప్పుడు అక్కడ బాన్ చేసినా కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో మాత్రం దొరుకుతోంది. చెఫ్ ఏం చేస్తాడూ అంటే జస్ట్ చేప చర్మాన్ని చ్కాటి డిజైన్ లో కట్ చేసి చక్కటి మాంసాన్నీ ఆకుకూరలనీ దాన్లో నింపి వడ్డిస్తాడు… అందులో ట్విస్ట్ ఏముందీ అనుకుంటున్నార… చీ..పాడు నేను చెప్పలేను బానూ కిందొక వీడియో ఉందీ అది చూడండి…

(Visited 1,785 times, 1 visits today)