Home / Inspiring Stories / మీ జీవితంలో ఇవి ఉంటే సక్సెస్‌ మీ వేంటే….

మీ జీవితంలో ఇవి ఉంటే సక్సెస్‌ మీ వేంటే….

Author:

ఉద్యోగం ప్రతి ఒక్కరి కల, దాని సాధించటం కొరకు చాలా కష్టపడతాము. అనుకున్న ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగిగా మన ప్రవర్తన, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో  ఇతర మనుష్యుల జీవితాల మీద, తోటి ఉద్యోగుల పనితనం మీద ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగం అనే బాధ్యతను సరిగ్గా నిర్వహించడం మన బాధ్యత, అలా తమకు ఇచ్చిన పనిని బాధ్యతయుతంగా నిర్వర్తించి మంచి పేరు సంపాదించిన వారిని మనం చాలా మందిని చూసి ఉంటాం. అలాగే మనం కూడా వారిలా ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాం కానీ అలా సక్సెస్‌ కావాలంటే ఎంతో శ్రమ, ఓర్పు, కాంక్షతో పాటు కొన్ని సోషల్‌ స్కిల్స్‌ చాలా అవసరం. అవి ఒకసారి మీరే చూడండి.

Portrait of handsome young man in shirt and tie keeping arms crossed and smiling while standing against grey background

Portrait of handsome young man in shirt and tie keeping arms crossed and smiling while standing against grey background

బాధ్యత :
విజయం సాధించినవారు తమ బాధ్యతల నుంచి ఎప్పుడు తప్పించుకోరు. ఎందుకంటే వాళ్లు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాన కారణం అదే. కాబట్టి మీరు మీ బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి.

నిజాయితీ :
మనం పని చేసే దగ్గర నిజాయితీగా వ్యవహరిస్తే అదే మనకు ఎంతో హెల్ఫ్‌ అవుతుంది. నిజాయితీగా ఉన్నారంటే భవిష్యత్తుకు ఢోకా ఉండదు.

మర్యాద :
మర్యాద అనేది మనకు గౌరవ సూచికం. మర్యాద అనేది మనం ఇతరులకు ఎంత ఇస్తే మనకు అంటే వస్తుంది. స్నేహితులను ఏర్పరచుకోవడానికి ఈ స్కిల్‌ సహాయపడుతుంది.

సహాయం కాంక్ష :
ఇతరులకు సహాయం చేయాలనే కాంక్ష మనలో ఉండాలి. అలా మనలో కాంక్ష ఉంటే ఎదుటివారిలోనూ అదే కాంక్ష బలపడుతుంది.

కలుపుగోలుతనం:
మనం పని చేసే చోట అందరితో కలుపుగోలుగా ఉండాలి. అలా కలుపుగోలుగా ఉంటే ఎదుటి వారిని బాగా డీల్‌ చేయగలము. మరియు స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే అది గట్టి స్నేహబంధాలకు దారితీసి మనకు ఎంతోగాను ఉపకరిస్తుంది.

క్షమించడం :
బాధపెట్టే అంశాలను మరిచిపోయి జీవితంలో ముందుకు వెళ్ళాలి.అలాగే మిమ్నల్ని బాధపెట్టిన వారిని క్షమించే గుణం ఉండాలి.

వినడం:
సక్సెస్‌ అయిన వారి జీవితంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే వారు ఎక్కువగా ఇతరులకు చెప్పేది “ఎదుటి వారు చెప్పేది చాలా జగ్రత్తగా విను అని”. ఎదుటి వారు చెప్పేది పూర్తిగా విన్న తరువాత మన అభిప్రాయాలను తెలియజేయాలి.

సహాయాన్ని అడగడం :
మన వల్ల ఎప్పుడైతే ఒక పని జరుగదో అప్పుడు ఇతరుల సహాయం అడుగటం అడగడానికి వెనుకడుగు వేయకూడదు. ఇలా అడగటం వలన ఇతరులు కూడా మనకు చాలా దగ్గరవుతారు. తెలియని విషయాలు మనకు ఎన్నోచెప్పే ఆవకాశాలు ఉంటాయి.

సహనం:
సహనం, ఓపిక మీరు ఏదైనా అనుకోండీ, ఉద్యోగంతో సంబందం లేకుండా ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణం. ఉద్యోగిగా తొందరపాటు నిర్ణయాలు చాలా చేటు చేస్తాయి. సహనాన్ని కోల్పోకుండా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి.

పైన చెప్పిన లక్షణాలను మొత్తంగా కాకపోయినా కొన్నింటిని అవలంభించినా మీ ఉద్యోగంలోనే కాదు జీవితంలో కూడా మీరు త్వరగా ఉన్నత స్థాయి కి చేరుకోగలరు.

Must Read: ఇది తాగితే 15 రోజులలో బలహీనంగా ఉన్న మీ ఎముకలు బలంగా అవుతాయి.

(Visited 2,812 times, 1 visits today)