Home / Inspiring Stories / అక్కడ హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయరు.

అక్కడ హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయరు.

Author:

no helmet no petrol

అక్కడ ఉన్న మూడు పెట్రోల్ బంక్ లోని పనివాళ్ళు అంత పోలీస్ వారి సమక్షంలో పని చేస్తున్నారు. అదేంటి అదేమన్న ఖైదీలు పని చేసే పెట్రోల్ బంక్ అనుకుంటున్నారా! కాదు కానీ పోలీస్ వారి సమాక్షంలోనే వారు చెప్పిన వారికే పెట్రోల్ పోస్తుంటారు. ఎక్కడ అని అనుకుంటున్నారా! కేరళలోని కన్నురు జిల్లాలోని కన్నపురం పోలీస్ స్టేషన్ అధ్వర్యంలో నవ్ జీవన్ లో భాగంగా హెల్మెట్ లేని వారికి అక్కడ పెట్రోల్ పోయాకూడదు అనే నియామన్ని అమలుచేస్తున్నారు.

ఎందుకు ఈ నియామన్ని అమలు చేస్తున్నారు అంటే ఒకసారి హెల్మెట్ లేకుండ చనిపోయిన వారిని చూసి వేంటనే ఈ కార్యాక్రమానికి శ్రీకారం చుట్టాడు S.I బిను మోహన్. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో అప్పటి నుండే చాలా కఠినంగా అమలు చేయడం మొదలు పెట్టాడు బిను. భారత్ లో 2013లో 34% వాహన దారులు హెల్మెట్ లేనందువలన చనిపోయినట్టు తెలిసింది. అయితే ప్రపంచం మొత్తంలో 40% మరణాలు, అలాగే 70% గాయాలు అవుతున్నాయట!. కానీ రూల్స్ కొద్దిగా కఠినంగా చేస్తే మాత్రం వీటిని మనం అరికట్టవచ్చట!.అలాగే కన్నపురం పోలీస్ స్టేషన్ పరిసరాలలో మూడు,నాలుగు నెలలోనే రెండు ప్రమాధాలు హెల్మెట్ లేకపోవడం వలనే జరిగాయట!

S.I బిను మోహన్ మట్లాడుతూ… మేము చేస్తున్న ఈ పని వలన చాలా మంది నుండి ప్రశంసలు పొందుతున్నాము. అలాగే హెల్మెట్ అనేది మన రూల్స్ లో ఒకటిగా ఉండాలి. మాకు ఇక్కడ ఉన్న మూడు పెట్రోల్ బంక్ వారు కూడా చాలా సహాకారం చేశారు అంటున్నాడు S.I బిను.ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతం అవడంతో ఇప్పుడు దీనిని ఆ జిల్లా మొత్తం చేయాలని చూస్తున్నారు.

(Visited 230 times, 1 visits today)