Home / Inspiring Stories / నల్ల సిరా రాయడానికే వాడారు మొహం పై చల్లటానికి కాదు.

నల్ల సిరా రాయడానికే వాడారు మొహం పై చల్లటానికి కాదు.

Author:

Chai Chalk Campainging against shiva sena Activities

సరిహద్దు వివాదాల వల్ల మనసుల మధ్య పెరుగుతోన్న దూరాన్ని తగ్గించటానికి పాకిస్తాన్ లో ఉన్న వారంతా భారత దేశాన్ని ద్వేషించేవారే అనే అభిప్రాయాన్ని పోగొట్టటానికి ముంబైకి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ రాం సుభ్రమణ్యం చేపట్టిన ప్రోగ్రాం కి విశేష స్పందన వస్తోంది..మొదటగా లాహోర్ విశ్వవిద్యాలయంలో ఉన్న పాకిస్తాన్ సాహిత్య వారసత్వ మేనేజ్మెంట్ సైన్సెస్ విభాగం విద్యార్థులతో నడపబడుతున్న చాయ్ చాక్ అనే ఒక సామాజిక సంస్థ నుంచి స్పందన మొదలైంది “భారత్ లో జరుగుతున్న సంఘీభావ కార్యక్రమాలు చూసాక మేము పాకిస్తాన్ వైపు నుండి ఒక వ్యవస్థీకృత పద్ధతిలో స్పందించడం మా భాద్యత కూడా అనిపించింది” అంటూ తొలి పోస్ట్ చేసాడు లాహోర్ విశ్వవిద్యాలయంలో మేనేజ్మెంట్  సైన్సెస్ విధ్యార్థి, చాయ్ చాక్ వ్యవస్తాపకుడూ అయిన “అసాద్ షబ్బీర్”.

Pakisthan Students response  for Shivasena Activities1

Pakisthan Students response  for Shivasena Activities2

అక్టోబర్ 7 న, పాకిస్తానీ గాయకుడు గులాం ఆలీ ఒక కచేరీ నిమిత్తం ముంబై కి వచ్చినపుడు శివ సేన నిరసనలు,బెదిరింపులకూ పాల్పడింది. దాంతో నిర్వాహకులు ఆ ఈవెంట్ నే రద్దు చేసుకోవలసి వచ్చింది. కొద్దిరోజుల తరువాత ఖుర్షీద్ మహ్మూద్ కసూరి పుస్తకం విడుదల పై దృష్టి పెట్టింది పుస్తకావిష్కరణ జరగటానికి కొద్ది గంటల ముందు ఆయన పై నల్ల సిరా చల్లి బెదిరింపులకు పాల్పడ్డారు శివసేన కార్యకర్తలు.

దీంతో పాకిస్తానీలు నల్ల సిరాతోనే స్నేహ పూర్వక సందేశాన్ని రాసి శివసేన చేసిన పనికి నిరసన నీ తమకు భారత్ పైన ఉన్న గౌరవాన్ని ఒకేసారి చూపించటానికి ఎన్నుకున్నారు..

Pakisthan Students response  for Shivasena Activities3

Pakisthan Students response  for Shivasena Activities4

Pakisthan Students response  for Shivasena Activities5

(Visited 60 times, 1 visits today)