Home / Reviews / తిక్క రివ్యూ & రేటింగ్.

తిక్క రివ్యూ & రేటింగ్.

Thikka-Perfect-Review-And-Rating

Alajadi Rating

1.25/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: సాయి ధరమ్ తేజ్, లారిస్సా బొనెసి, మన్నారా చోప్రా, రాజేంద్ర ప్రసాద్, అలీ, తాగుబోతు రమేష్.. తదితరులు.

Directed by: సునీల్‌రెడ్డి

Produced by: రోహిణ్ రెడ్డి

Banner: శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్.

Music Composed by: ఎస్.ఎస్.తమన్

సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు నటించిన సినిమాలు నాలుగు కానీ మనోడికి పది సినిమాలు చేసిన వారి కంటే ఎక్కువగా పేరు వచ్చింది దానికి కారణమ్ మెగా కుటుంబం నుండి రావడమే. అందులో మేనమామ పోలికలు ఉండటం మానవుడికి బాగా కలసి వచ్చింది. ఇప్ప‌టికే సుబ్ర‌హ్మ‌ణ్యం, సుప్రీమ్ సినిమాల హిట్ల‌తో జోరుమీదున్న సాయి ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాను ఓం సినిమాను డైరెక్ట్ చేసిన సునిల్ రెడ్డి ఈ సినిమాతో తాన్ తిక్క ఎంతో చూపించనున్నాడు. మరి వారి తిక్క ఎలా ఉందొ ఒక్కసారి చూద్దాం.

కథ :

ఆదిత్య (సాయి) ఎప్పుడు తాగుతూ,అమ్మాయిల వెంట తిరుగుతూ లైఫ్ ని ఎంజాయి చేస్తుంటాడు. అసలు లైఫ్ లో ఎలాంటి కమిట్ మెంట్ లేకుండా బ్రతికేస్తుంటాడు. అలాంటి సమయంలో హీరోయిన్ పరిచయం కావడం తర్వాత వారిద్దారు ప్రేమిచుకోవటం జరుగుతుంది.ఈ ల‌వ్ ఇలా కంటిన్యూ అవుతుండ‌గానే అనుకోని సంఘటన వలన అంజ‌లి, ఆదిత్య‌కు గుడ్ బై చెపుతుంది. ఆదిత్య లవ్ ఫెల్యూర్ ని తట్టుకోలేక బాగా తాగి ఓ రాత్రి చేసిన తప్పుల వ‌ల్ల అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగిపోతాయి. ఇంతకు అంజలి, ఆదిత్య లవ్ కి ఎందుకు బ్రేకప్ చెప్పింది. తాగిన మైకంలో ఆ రాత్రి ఎలాంటి పనులు చేసాడు అనేది మిగతా సినిమా.

అలజడి విశ్లేషణ:

ఈ సినిమా మొత్తం సాయి తన భుజాలపై మోశాడు అంటే సరిపోతుంది. ఎందుకంటే సాయి తన నటన,డాన్స్, ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ మిగతా నటీనటులు మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. దానికి కారణం దర్శకుడు ఎంచుకున్న కథ, కథనం. సినిమా మొత్తం చాలా క‌న్‌ఫ్యూజింగా ఉంది. ఇక హీరోయిన్లు లారిస్సా బొనెసి, మ‌న్నారా చోప్రా గ్లామ‌ర్ డోస్‌కే త‌ప్ప సినిమాకు పెద్ద‌గా హెల్ఫ్ కాలేదు. ఆలీ-మ‌మైత్‌ఖాన్ ట్రాక్ కూడా ఎందుకు పెట్టారో అర్ధం కానీ పరిస్థితి. ఇక ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే చాలా సీన్లు చాలా చాలా క‌న్‌ఫ్యూజింగా ఉంటూ ఏ పాత్ర ఎందుకుయ్ వస్తుందో అర్థంకాని పరిస్థి. హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడ సరిగా రాసుకోలేదు దర్శకుడు. ఇక ఇందులో చెప్పకోవలసిన విషయం ఏమైనా ఉంటే అది ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రమే…

ఇంటర్వెల్ తరవాత సినిమా కొద్దిగా ముందుకు సాగుతుంది. అక్కడక్కడా కొచం కామెడీ చేస్తూ నవ్వించే ప్రయత్నం చేశారు తాగుబోతు రమేష్, సప్తగిరి. ఇక పోలీస్ పాత్రలో పోసాని కామెడీ పంచాలని చూసినా అంతగా పండలేదు. అలాగే రాజేంద్ర ప్రసాద్ రోల్ అంత ప్రాముఖ్యత అనిపించలేదు. కొడుకుని పద్ధతిగా పెంచాల్సిన తండ్రే తప్పుదారిలో నడవడం అంతగా నప్పదు. కన్ ఫ్యూజ్ కథనంతో ఉన్న కొద్దిపాటి కామెడీ ప్రేక్షకులకు ఎక్కలేదు.

నటీనటుల పనితీరు:

సుప్రీం స్టార్ సాయి ధరం తేజ్ తిక్క సినిమాలో ఆదిత్యగా అల్లరి చిల్లరగా ఆకట్టుకున్నాడు. కొచ్చం తాగుడు ఎక్కువైనా పరవాలేదు అనిపించాడు. అంజలిగా నటించిన లారిసా అయితే కొన్ని సీన్స్ లో హీరోయిన్ గా ఆమె రాంగ్ సెలక్షన్ అనే ఫీలింగ్ కలుగుతుంది.
సాధుగా అజయ్ ఓకే అనిపించగా.. కమెడియన్స్ గా ఆలి, సప్తగిరి, సత్య, తాగుబోతు రమేష్ ఇలా ప్రతి కమెడియన్ నవ్వించే ప్రయత్నం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

కళ్యాణ్‌ రామ్‌తో ‘ఓమ్‌’ అనే సినిమా చేసిన సునీల్‌రెడ్డి. చాలా రోజుల తర్వాత ఒక మంచి హీరో , మంచి ప్రొడ్యూసర్ దొరికితే అప్పుడు చేసిన తప్పులు మల్లి చెయ్యకుండా జాగ్రత్తగా తీయవలసిందిపోయి. మళ్ళీ అదే తప్పు చేశాడుసునీల్ రెడ్డి. సరైన కథ, కథనం లేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్. తమన్ సంగీతం మాత్రం బాగుంది. మంచి పాటలే ఇచ్చాడు. నీకోసం.. వెళ్లిపోకే.. టైటిల్ సాంగ్.. మూడూ కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లుగా ఉంది.  ఈ సినిమాకి మాటలు కూడా ఏమాత్రం బాగాలేవు.

ప్లస్ పాయింట్స్:

  • సాయిధ‌ర‌మ్ తేజ్
  • సినిమాటోగ్ర‌ఫీ
  • నిర్మాణ విలువ‌లు

మైనస్ పాయింట్స్:

  • కథ
  • డైరెక్ష‌న్‌
  • హీరోయిన్లు
  • స్ర్కీన్ ప్లే

పంచ్ లైన్: సినిమా అంత తిక్క ‘తిక్క’

(Visited 141 times, 1 visits today)