Home / Entertainment / క్రేజీ టెక్నీషియన్ తో యన్.టి.ఆర్

క్రేజీ టెక్నీషియన్ తో యన్.టి.ఆర్

Author:

ntr

తిర్రు ఈ పేరు మనకు కొత్త కానీ కోలివుడ్,బాలివుడ్ లో సుపరిచితమే ఇతను గతంలో కమల్ నటించిన ‘హే రామ్’, ‘ఆభయ్’ లతో పటు క్రిష్ 3, 24 సినిమాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, కొరటాల శివ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమాకు పనిచేయ్యడానికీ తిర్రు నీ సెలక్ట్ చేశారు.

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం తన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాని పూర్తి చేయకముందే ఆయన తన తదుపరి సినిమాని కొరటాల శివ డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా అదికారికంగా లాంచ్ చేసారు. కొరటాల శివ ఈ సినిమా కోసం ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తూనే ఆ సినిమాలోని పాత్రలకి సరిపోయే నటులను, టెక్నీషియన్స్ ని సెలక్ట్ చేస్తూ వస్తున్నాడు. నిన్ననే ఈ సినిమాలో ఓ మెయిన్ రోల్ కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఎంపిక చేసారు. ఆయనతో పాటు టెక్నీషియన్స్ గా కూడా క్రేజీ ఇమేజ్ ఉన్న వారిని సెలక్ట్ చేస్తున్నాడు.. కొరటాల శివ గత రెండు సినిమాలకు మదిని సినిమాటోగ్రాఫర్ గా తీసుకున్నప్పటికీ ఈ సినిమాకి మాత్రం తిర్రుని సెలక్ట్ చేసాడు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిచనున్నాడు. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి ఆగష్టు 12న, 2016లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

(Visited 146 times, 1 visits today)