Home / Inspiring Stories / 7 నెలల పాపతో దేశం కోసం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న బ్యాంకు ఉద్యోగికి సలామ్ చేయాల్సిందే..!

7 నెలల పాపతో దేశం కోసం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న బ్యాంకు ఉద్యోగికి సలామ్ చేయాల్సిందే..!

Author:

కొందరు తన కంటే, తన కుటుంబం కంటే సమాజం కోసం పని చేస్తుంటారు. అలా చేయాలి అంటే వారికి సమాజంపై చాలా ప్రేమ ఉండాలి. అలాంటి వారిలో కాంచన ఒకరు అనిచెప్పాలి. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు బ్యాంకు ఉద్యోగులు వారి శక్తికి మించి పనిచేస్తున్నారు. పని వత్తిడిని తట్టుకోలేని వారు సెలవులు తీసుకుంటున్నారు. కాంచన మాత్రం తన ఏడూ నెలల పాపతో బ్యాంకుకి వచ్చి ప్రజలకు సర్వీస్ చేస్తూ ఆధికారుల నుండే కాదు ప్రజలనుండి మెప్పు పొందుతుంది.

bank-employee

బీహార్ రాష్ట్రంలో ఖగరియా జిల్లా అలహాబాద్ బ్యాంక్ లో ప్రతి రోజు బ్యాంక్ టైం కు తన ఏడూ నెలల పాపతో వస్తుంది. ఒకపక్క ప్రజలకు బ్యాంకులో డబ్బులు పంచుతూనే పరో పక్క తల్లిగా తన కూతురికి ప్రేమను పంచుతుంది. డబ్బుల కోసం వచ్చిన ప్రతి ఒక్కరు కౌటర్ లో కాంచన పక్కన ట్రాలీ ఊయలలో ఆడుతున్న చిన్నపాపను చూసి కాంచన తన కోసం ఎంత కష్టపడుతుందో అనుకుంటూ పాప ఏడ్చినప్పుడు పర్వాలేదు మేడం మేము వెయిట్ చేస్తాం పాపకు ముందు పాలు పట్టండి అని చెబుతున్నారు….

ఈ విషయం పై కాంచన మాట్లాడుతూ …. ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారు అందుకే ముందు పని తరువాతనే విశ్రాంతి, ప్రజలు పడుతున్న బాధలకంటే నేను పడుతున్న బాధ చాలా తక్కువ. నేను ఏం గొప్ప పని చేయడం లేదు నా పని నేను చేస్తున్నాను అంటుంది.

ఈ విషయం గురించి బ్యాంకు మేనేజర్, కాంచన ఫ్యామిలీ వారు మాట్లాడతూ … కాంచన ఎప్పుడు తన పని తానూ ఎంతకష్టమైన చేస్తుంది. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఉండలేదు అందుకే మేము కూడా తనకు సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు.ఇలా పనిని ప్రేమించేవారు చాలా తక్కువ మంది. ఇలాంటి టైం లో కాంచన లాంటి వారి పని ప్రజలకు  చాలా అవసరం  ఉంది. కాంచన అనుకుంటే పాప కోసం సెలవులు పెట్టొచ్చు కానీ ఒక్క పాప కోసం అంత మంది ప్రజలను ఇబ్బంది పెట్టలేక ఇలా చేస్తుంది. కాంచన కావాలనుకుంటే ప్రసూతి సెలవులు తీసుకునే ఆవకాశం ఉంది కానీ దేశం కోసం, ప్రజల కోసం తన వంతు సహకారంగా ఉద్యోగం చేస్తుంది, ప్రజల కోసం తమ స్వార్థం చూసుకోకుండా పని చేస్తున్న కాంచన లాంటి వారిని ఖచ్చితంగా అభినందించాల్సిందే..!

(Visited 892 times, 1 visits today)