Home / Inspiring Stories / సౌరశక్తితో ఉప్పు నీటిని మంచినీరు చేసే యంత్రాన్ని కనిపెట్టిన ఇండియన్.

సౌరశక్తితో ఉప్పు నీటిని మంచినీరు చేసే యంత్రాన్ని కనిపెట్టిన ఇండియన్.

Author:

Salt Water to Drinking water

అసలే ఎండాకాలం, అందులోనూ జనాభా ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాలలో నీటి ఎద్దడి తట్టుకోవటం చాల కష్టమైన పని ,ఇలాంటి సమస్యకి ప్రత్యామ్యాయంగా గాబ్రియల్ డినాంటి అనే కుర్రోడు ఉప్పునీటి శుద్ధియంత్రాన్ని తయారుచేసాడు,అదీ కేవలం సౌరశక్తిని మాత్రమే వినియోగించుకుని పనిచేసే యంత్రం .

దీని పని తీరు మనం కాఫీ షాపుల్లో చూసే కాఫీ మిషన్ పని తీరుకు దగ్గరగా ఉంటుంది ,అంతే కాదండోయ్ ఈ పరికరాన్ని మనకి అందుబాటులో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు కూడా ,మరియు ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతున్న నీటిశుద్ది యంత్రాలతో పోలిస్తే సగం ధరకే దీనిని రూపొందించొచ్చు కరెంటు,ఇందనం వంటి ఏ ఇతర వనరలు అవసరం లేకుండా ,ఉపయోగించగలగటం దీనిలో అతిపెద్ద వెసులుబాటు ,అందులోనూ ఇది ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అవ్వటంతో అందుబాటులో ఉన్న పరికరాలతో ఎవరైనా అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ చాల అవార్డులు కూడా సాధించిందండోయ్, Well-Tech Award 2012 మరియు Prix Emile Hermes competition 201 అవార్డులు గెలుచుకుంది.

ఈ పరికరం మనదేశంలో అభివృద్ధి చేస్తే గ్రామీణ ప్రాంతపు ప్రజలకు సులభంగా నీటి ఎద్దడి తీర్చొచ్చు ,రేపటి రోజున ఎదురవ్వబోతున్ననీటి కరువు అనే అతి పెద్ద ఆపదని ఎదుర్కొవచ్చు.

Must Read: మగవారు మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా!?

(Visited 4,341 times, 1 visits today)