Home / Inspiring Stories / ఆడపిల్ల పుడితే అక్కడ అంతా ఉచితమే.

ఆడపిల్ల పుడితే అక్కడ అంతా ఉచితమే.

Author:

yourstory-dr-ganesh-rakh

లేబర్ రూంలో నుంచి బయటకి వచ్చిన నర్స్ “అబ్బాయి పుట్టాడండీ..!” అని చెప్పినంత ఉత్సాహంగా ఆడపిల్ల పుడితే చెప్పదు. ఇది మామూలుగా ప్రసూతి ఆసుపత్రిలో కొందరికి ఎదురయ్యే అనుభవమే. ఆడపిల్ల పుట్టుకే ఒక భాదాకర సంఘటన అనుకునే అనాగరిక మూడత్వంలో ఉన్న మనుషులు మన చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఐనా ఎక్కడో ఒక చోట ఆపరేషన్ ధియేటర్ లోంచి ఆడపిల్ల ఏడుపు వినిపించగానే “మహాలక్ష్మి” అంటూ మురిసి పోయే మనుషులూ ఉన్నారు.

అమ్మాయి పెనుభారం అనుకునే మనుషుల మధ్య బ్రూణ హత్యలూ,చెత్త కుండీల్లో శిశువులూ,ఆసుపత్రి టాయిలెట్లలో పసి శరీరాలు కనిపించే సంధర్భాల్లో నూ ఒక డాక్టర్ తన ఆసుపత్రిలో ఆడపిల్లని కన్నవాళ్ళకి అసలు ఫీజు తీసుకోవటమే లేదు.ఔను మీరు చదివేది నిజం ఆ ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మిస్తే తల్లిదండ్రులు ఎలాంటి వైద్య ఫీజ్‌ చెల్లించనవసరం లేదు. అంతా ఉచితం. మహారాష్ట్ర పుణేలోని హదాప్సర్ ప్రాంతంలోఈ హాస్పిటల్‌ ఉంది. ఇక్కడ సాధారణ ప్రసవానికి రూ.10 వేలు, సిజేరియన్ కు రూ.25 వేలు తీసుకుంటుండగా, ఆడపిల్ల పుడితే మాత్రం ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు.

ఆ మనసున్న డాక్టర్ పేరు డా. గణేష్‌ రాఖ్‌ ఈయన నేతృత్వంలో “మెడికేర్‌ హాస్పిటల్‌ ఫాండేషన్‌ ట్రస్ట్” ఈ ఆసుపత్రిని నడుపుతున్నారు. 25 పడకలతో ఉండే ఈ ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మిస్తే తల్లిదండ్రుల నుంచి రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా వైద్యాన్ని ఆందిస్తున్నారు. అంతే కాదు పుట్టిన పాప పేరు మీద ఆసుపత్రి యాజమాన్యమే స్వీట్లు, కేకులు పంచుతారు. ఇప్పటివరకు ఈ విధంగా 432 మంది మహిళలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు.

లింగ వివక్షను రూపుమాపాలనే ఉద్దేశంతోనే తన వంతు ప్రయత్నంగా 2007 నుంచి ఈ విధమైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నారీ డాక్టర్. ప్రసవ సమయంలో పుట్టే బిడ్డ ఆరొగ్యమూ,బిడ్డ క్షేమం కంటే ముందు పుట్టేది మగపిల్లవాడా, లేక ఆడపిల్లనా అని ఆందోళన పడే కొందరు మనుషులని చూసినప్పుడు ఎంతో భాదనిపించేది. అబ్బాయి పుడితే ఆనందం అమ్మాయి పుడితే బాధ ఎందుకు…? కనీసం చదువుకోని వారిని పక్కకుపెడితే ఫారిన్ లో చదువుకొని వచ్చిన వారిలోనూ ఇదే లింగ వివక్ష భావజాలాన్ని చూసాను.ప్రజల్లో పేరుకు పోయిన ఇలాంటి ఆలోచనలో మార్పు తేవటానికి నావంతుగా ఏమైనా చేయాలనిపించింది.అందుకే ఆడపిల్ల పుట్టుకని ఒక ఆనంద మయ వేడుకగా వాళ్ళు ఫీలయ్యేలా చేయటం మొదలు పెట్టాను.” అంటూ చెబుతారు గణేష్.

ఆడపిల్ల వద్దనుకునే తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తున్నారిక్కడ. ఆస్పత్రి వెబ్ సైట్ ద్వారా కూడా ఆడపిల్ల రక్షణ కోసం ప్రచారం సాగిస్తూన్నరు.ఆడపిల్లల రక్షణ కోసం ఉండే మార్గాల్లో ఏఒక్క మార్గాన్నీ వదులుకోవటానికి సిద్దాంగా లేరు వాళ్ళు.. లింగ వివక్షను రూపుమాపడానికి ఆయన చేస్తున్నకృషి మరింత గుర్తింపు పొందాల్సిన అవసరం ఉంది.

Must Read: మీ ఇంట్లో చిన్న పిల్లలున్నారా..? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి..!

(Visited 1,513 times, 1 visits today)