Home / Inspiring Stories / కొంతమంది ఈ ఫోటోగ్రాఫర్ ఫోటోను దేవుళ్ళ పక్కన పెట్టి పూజిస్తారు ఎందుకో తెలుసా?

కొంతమంది ఈ ఫోటోగ్రాఫర్ ఫోటోను దేవుళ్ళ పక్కన పెట్టి పూజిస్తారు ఎందుకో తెలుసా?

Author:

జనరల్ గా ఒక ఫోటోగ్రాఫర్ మనల్ని తీసిన ఫోటోని మనం ఇంట్లో పెట్టుకుంటాం కానీ ఆ ఫోటోగ్రాఫర్ ఫోటోని మన ఇంటిలో పెట్టుకోము, కాని ముంబై జుహూ బీచ్ చుట్టుపక్కల చాలా మంది ఇళ్లల్లో ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో దర్శనమిస్తోంది. ఎవరిదా ఫోటో? ఎందుకు అందరూ అతనిని అభిమానిస్తారో? క్రింద చదవండి.

జార్ఖండ్ కి చెందిన బంటీ రావ్ కి ఫోటోగ్రఫి అంటే చాలా ఇష్టం దానితో తను చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం నచ్చక దానిని వదిలేసి ముంబై జుహూ బీచ్ లో ఫోటోగ్రాఫర్ గా మారాడు. బీచ్ అందాలు చూడడానికి వచ్చిన జనాలు, పర్యాటకులకు ఒక అందమైన ఫోటో తీసి పెట్టేవాడు. అతని ఫోటోగ్రఫి మెళకువలని చూసి చాలా మంది డబ్బులతో పాటూ మంచి కంప్లిమెంట్స్ ఇచ్చి వెళ్లేవాళ్లు. అలా అతని ప్రతిభ గుర్తించిన చాలా మంది పెళ్లిల్లకు, శుభ కార్యాలకు పిలిచి ఫోటోస్ తీయమనేవారు. అలా సినిమాలకు పనిచేసేదాకా వెళ్లాడు. డబ్బు, పేరు వస్తున్నాయి కానీ అతనిలో ఇంకా ఏదో అసంతృప్తి అలానే ఉంది. ఎప్పటిలాగే ఒక రోజు జుహూ బీచ్ లో బంటీ రావ్ ఫోటోస్ తీస్తుండగా కొన్ని అరుపులు వినిపించాయి..చూస్తే ఎవరో సముద్రం లో కొట్టుకుపోతూ, ఊపిరి ఆడక, చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు అయ్యో పాపం అంటున్నారు..ఇంకొందరు ఫోన్స్ తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్టున్నారు కానీ అరే కాపాడుదాం అని ఎవరికీ అనిపించట్లేదు సరికదా..బంటీ సముద్రం లోకి దూకబోతుంటే, పొయుంటాడు ఇంకా దేనికని అడ్డు చెప్పారు. అయినా అవేవి పట్టించుకోకుండా బంటి సముద్రం లోకి దూకి అతని ప్రాణాలు కాపాడాడు.

Jharkhand Man Who Has Saved More Than 50 Lives at Mumbais Juhu Beach

ఒక ప్రాణం కాపాడాక అర్థమయింది జీవితం విలువేమిటో.. దెబ్బకి ఇన్నిరోజులుగా అతని లో ఉన్న అసంతృప్తి ఎగిరిపొయింది. ఒక మనిషి ప్రాణం కాపాడితే, సాటి మనిషికి సహాయం చేస్తే వచ్చే తృప్తి, అనందం ఎక్కడా దొరకదని అర్థమయింది. ఇంక తను చేయాల్సిందేంటో , తన గమ్యం ఏంటో ఫిక్సయ్యాడు. సూర్యోదయం కన్నా ముందే బీచ్ కు వచ్చి రాత్రి పదకొండింటి వరకు అక్కడే ఉంటాడు. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చిన సహాయం చెయ్యడం, ప్రమాదవశాత్తో, ఆత్మహత్య వలన సముద్రం లో పడిపోయినవాళ్లని కాపాడి కాని ఇంటికెళ్లడు. రాత్రి ఇంటికి వెళ్లేముందుకూడా ఒకటికి రెండు సార్లు జనాలు ఎవరు ప్రమాదంలో లేరు అని నిర్డారించుకునే వెళ్తాడు. బంటీ రావ్ ఇప్పటి దాకా 50 మందికి పైగా ప్రాణాలు తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ మధ్యే మరికొంతమంది తో కలిసి బేవాచ్ లైఫ్ గార్డ్ అసోసియేషన్ ని కూడా స్టార్ట్ చేసాడు. ఒకప్పటి బీచ్ ఫోటోగ్రాఫర్ ఫోటో ఇప్పుడు చాలా ఫేమస్ ఐపొయింది. బంటీ చేతిలో సేవ్ చేయబడ్డ వారితో పాటూ పర్యాటకులు కూడా బంటి తో ఫొటో దిగి కానీ అక్కన్నించి కదలరు అలా బంటీ ఫొటో చాలా మంది ఇళ్ళకు చేరింది. మానవ సేవే మాదవ సేవ అని నిరూపిస్తున్న బంటి రావ్ కి అలజడి హాట్సాఫ్ చెబుతోంది. ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా.. సాటి మనిషి కి సహాయం చెయకపొతే ఆ జీవితం వ్యర్థమే..

(Visited 200 times, 1 visits today)