Home / health / అధిక బరువు, గుండె, కిడ్నీ, లివర్ సమస్యలకు దివ్యౌషధం.

అధిక బరువు, గుండె, కిడ్నీ, లివర్ సమస్యలకు దివ్యౌషధం.

Author:

అదేంటో గాని చిన్న వయసులో పిల్లలు బొద్దుగా లేకపోతే బాధపడతాం అదే మరి పెద్దయ్యాక బొద్దుగా ఉంటే ఇంకో బాధ. బొద్దుగా ఉన్న పిల్లల్ని చూసి ముద్దు చేస్తాం అదే పెద్ద వాళ్ళు బొద్దుగా ఉంటే మొద్దు అంటాం. సరైన వ్యాయామం మరియు ఆహార ప్రణాళిక లేకపోవడం వలన మన దేశంలో చాలా మంది అధిక బరువు తో బాధ పడుతున్నారు. శరీర అధిక బరువు పలు ఇతర సమస్యలకు దారి తీస్తుంది. అధిక బరువు వలన గుండె, కిడ్నీ, లివర్ మీద భారం పడి వాటికి సంబందించిన వ్యాధులు వస్తాయి. అందుకే అందరూ తాము తీసుకునే ప్రతి ఆహారం లో పోషక విలువలు అధికంగా, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. దానికి తోడు ప్రతి చిన్న సమస్యకి మందులు వాడే కంటే ఇంట్లో ఉండే పదార్దాలతోనే ఈ దివ్యౌషధాన్ని తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

lemon ginger garlic juice

అల్లం వెల్లుల్లి మరియు నిమ్మకాయ మిశ్రమం తయారు చేసుకునే విధానం:

రెండు నిమ్మకాయలు, రెండు అల్లం కొమ్మలు, రెండు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకునొ ముక్కలుగా కట్ చేయాలి. వాటిని పేస్ట్ అయ్యేదాకా గ్రైండ్ చేయాలి. అలా గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ ని రెండు గ్లాసుల మంచి నీటిలో కలిపి చాలా సేపు మరిగించాలి. మరిగిన ఈ మిశ్రమాన్ని చల్లార్చి ఒక సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ జ్యూస్ ని గనక రెగ్యులర్ గ తాగితే అధిక బరువుతో పాటు, దాని ద్వారా కలిగే అన్ని సమస్యలు దూరం అవుతాయట. ఒక వారం రోజుల పాటు ప్రతి రోజు పరిగడుపున లేదా భోజనం చేసే గంట ముందు ఈ జ్యూస్ తాగాలి. తర్వాత ఒక వారం రోజులు బ్రేక్ ఇవ్వాలి. వారం బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో ఈ నిమ్మకాయ అల్లం వెల్లుల్లి జ్యూస్ తో మన రోగాలన్నీ మటుమాయం. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెష్ నిమ్మకాయలు అల్లం వెల్లుల్లి మార్కెట్ కి వెళ్లి తెచ్చేసుకుందామా?

(Visited 738 times, 1 visits today)