Home / Inspiring Stories / ఫుల్ పేజీ యాడ్ తో జనాలకి నిజం చెప్పిన వ్యక్తి.

ఫుల్ పేజీ యాడ్ తో జనాలకి నిజం చెప్పిన వ్యక్తి.

Author:

ఇప్పుడు ప్రపంచం మొత్తం బ్రిటన్ వైపు చూస్తుంది. యురోపియన్ యూనియన్ లో ఉండాలా? వద్దా? అని పెట్టిన రెఫరెండంలో ఎక్కువ శాతం వోట్లు బ్రిటన్, యురోపియన్ యూనియన్ నుండి బయటకి రావాలని వేశారు. అలా జరగడానికి ఒక కారణం వలసవాదం. బ్రిటన్ లో ఉంటున్న వారు వేరే యురోపియన్ దేశాల వారు తమ దేశానికి వచ్చి తమ ఉద్యోగాలు తమకు కాకుండా చేస్తున్నారని నమ్మడం. ఒకవేళ బ్రిటన్ యురోపియన్ యూనియన్ నుండి బయటకి వచ్చేస్తే తమ ఉద్యోగాలు తమకే వస్తాయని గట్టిగా నమ్మడంతో అందరు తమ వోట్లను బ్రిటన్, యురోపియన్ యూనియన్ నుండి బయటకి రావాలని వోట్లు వేశారు. కానీ దీనిని వ్యతిరేకించే వారు కూడా చాలా మంది ఉన్నారు, వారు కూడా కలిసి ఉంటే కలిగే ఉపయోగాలను ప్రచారం చేసి వోట్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. అలాంటి ఒక వింత ప్రయత్నం గురించి మనం మాట్లాడుకుందాం.

Full page ad against brexit

లండన్ నగరంలో ప్రతిరోజు వెలువడే మెట్రో పత్రికలో ఒక పేజీ నిండా వచ్చిన ఒక వార్త అందరినీ ఆకట్టుకుంది. తెల్లటి పేజీలో ఒక పెద్ద గ్రాఫ్, అందులో బ్రిటన్ దేశ జనాభా మరియు బయటి దేశస్థుల జనాభా ను సూచించి కేవలం 0.5% మంది బయటి దేశస్థులు మన ఉద్యోగాలు దోచుకుంటున్నారనడం హాస్యాస్పదం అని, వారు బ్రిటన్ కి సృష్టించే సంపద చాలా ఎక్కువని, దొంగ రాజకీయ నాయకుల మాటలు నమ్మి మోసపోవాద్దని సింపుల్ గా చెప్పాడు. ఇలా తన సొంత డబ్బులతో జనాలకు నిజం చెప్పడానికి ట్రై చేసి లండన్ కి చెందిన లారెన్స్ టేయిలర్ ఒక్కరోజులోనే ఫెమస్ అయిపోయాడు. అసలు నిజాలు చెప్పకుండా యురోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ ని విడగొట్టడానికి రాజకీయ నాయకులు చెప్తున్న అబద్దాలతో విసిగిపోయిన లారెన్స్ ఈ పని చేశాడు. కానీ ఎం లాభం జనాలు మాత్రం బ్రిటన్ విడిపోవడానికే మద్దతిస్తూ ఓట్లు వేశారు.

(Visited 560 times, 1 visits today)