Home / health / మద్యపానం అలవాటు నుండి బయటపడేందుకు అద్భుతమైన చిట్కా.

మద్యపానం అలవాటు నుండి బయటపడేందుకు అద్భుతమైన చిట్కా.

Author:

మద్యం యొక్క ప్రభావం మొట్టమొదటగా ఆరోగ్యం మీదే పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతుడిని కూడా భయంకరమైన రోగాల బారిన పడేస్తుంది. మద్యం సేవించటం అనేది ఒక దీర్ఘకాలిక రోగం వంటిది. సాదారణంగా అది పెరుగుతూనే ఉంటుంది కాని తగ్గటం అంటూ జరగదు. తప్ప తాగి ప్రతిరోజు ఇంట్లో వారితో మరియు ఇరుగు పొరుగు వారితో గొడవ పడేవారిని మనం గమనిస్తూనే ఉంటాం.మద్యం తాగి వాహనం నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయే వారి గురించి తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం. కానీ, తాగుడుకు బానిస అయిన వారిని ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే మెంతులతో మద్యపాన అలవాటును మాన్పించేలా చేయొచ్చు. శరీరంలోపలి విషాలను (టాక్సిన్లు) బయటకు పంపించి, శరీరం నిత్యం ఆరోగ్యంగా ఉంచడంలో మెంతులు చాలా బాగా సహాయపడతాయి. బీపీ, షుగర్, స్థూలకాయం లాంటి అనారోగ్య సమస్యలకే కాక…మద్యపానానికి భానిసైన వారి ఆరోగ్యాన్ని కాపాడి, వారిని తాగుడు అలవాటు నుండి దూరం చేయడంలోనూ… మెంతులు శక్తివంతంగా ఉపయోగపడతాయి.

stop alcohol

  • మద్యపానం అలవాటు ఉన్న వారికి, రెండు చెంచాల మెంతి గింజలను తీసుకొని, సుమారు 4 గంటల పాటు వాటిని నీటిలో నానబెట్టి వాటిని అదే నీటితో ఉడకబెట్టి, వడగట్టి తేనెతో కలిపి తినేలా చేయాలి. దీని కారణంగా దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుకోవొచ్చు. అంతే కాక, ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల, మెంతుల్లో ఉంటే చేదు, జిగురు తత్త్వాలు మద్యం అంటేనే ఓ రకమైన అసహ్యభావం కలిగించేలా చేస్తాయి. ఫలితంగా ఎంత మద్యపాన ప్రియులైన ఈ మిశ్రమం తిన్నాక మద్యం జోలికి వెళ్లరు. ఈ మిశ్రమాన్ని అందిస్తూనే… ఆ వ్యక్తి యొక్క అవసరం కుటుంబానికి ఏ మేరకు ఉందో అతనికి వివరించాలి. ఆ మిశ్రమ ప్రభావానికి తోడు, మాటలు అతడిని మానసికంగా కూడా మద్యం జోలికి పోకుండా చేస్తాయి.
  •  తాగుడుకు బానిస అయినా వారికి, మెంతు ఆకులతో తయారు చేసిన డికాషన్ పట్టించాలి. ఇలా మెంతులు, మెంతు ఆకులు కలిసి, తాగుడికి అలవాటైన వ్యక్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచడమే కాకుండా, వారిని తాగుడు అలవాటు నుండి బయట పడేలా చేస్తాయి.
(Visited 6,343 times, 1 visits today)