Home / Inspiring Stories / ఒకే చెట్టుకు 40 రకాలైన పూలు, కాయలు కాస్తే ఎలా ఉంటుంది!

ఒకే చెట్టుకు 40 రకాలైన పూలు, కాయలు కాస్తే ఎలా ఉంటుంది!

Author:

మనం ఏదైనా చెట్టును చూసినప్పుడు నిండుగా పూలతోనో, లేదా పండ్లతోనో ఉంటే ఈ పకృతి ఎంత గొప్పది అని అలా చూస్తూ ఉండిపోతాం. మరి అదే ఒక చెట్టుకు ఏకంగా 40 రకాల పూలు,  పండ్లు కాస్తే చూడటానికి మన రెండు కళ్లు సరిపోతాయా! అదేంటి ఒక్క చెట్టుకు 40 రకాలైన పూలు,  పండ్లు ఎలా కాస్తాయి అనే కదా! మీకు వచ్చిన అనుమానం కావాలంటే మీరే చూడండి.

tree-grows-more-than-forty-type-of-fruits
సైరాక్రాస్ యునివార్సిటీ ప్రొఫెసర్ సామ్ వామ్ ఆకెన్ ఎంతో కష్టపడి, ఇష్టంతో పెంచుతున్న చెట్టు ఇది. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆకెన్ న్యూయార్క్ లో పండ్ల తోట కూడా ఉంది అందులో ఎన్నో అపురూమైన పూల చెట్లను, పండ్ల చెట్లను పెంచుతున్నారు. అందులో భాగంగానే ఒక మొక్కకి వేర్వేరు పూల, పండ్ల మొక్కలను కలిపి అంటూ కడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అలా ఒకదాని తరవాత ఒకటి చొప్పున ఏకంగా 40 మొక్కలను అంటుకట్టాడు… మరి చెట్టు ఎలా పెరుగుతుందో అని చాలా భయపడ్డ ఆకెన్  ను పకృతి కూడా స్వాగతించింది. మెల్లగా చెట్టు పెరగడం ప్రారంభం అయింది…

చెట్టు అయితే పెరుగుతుంది కానీ దీనికి ఏ చెట్టు కాయ  కాస్తుందా అని ఆకెన్ చాలా ఆలోచించాడు కానీ చెట్టు మాత్రం తన పని తానూ చేసుకుంటుపోయింది. ముందుగా వసంత కాలంలో  పువ్వులతో ఆ చెట్టంత చాలా అందగా రకరకాలైన పూలతో, అలాగే కాయ కాసే సమయంలో స్టోన్ ఫ్రూట్ వెరైటికి చెందిన పిచ్, ఆప్రికాట్, చెర్రీస్, ప్లమ్స్ లాంటి పండ్లతో అలాగే బాదాం వంటి కాయలతో చెట్టు  చూడ ముచ్చటగా ఉంటుంది.

కొన్ని సందర్భాలలో ఒకవైపు పూలు, కాయలతో కనువిందు చేస్తుంది ఈ అంటూ కట్టిన చెట్టు. ఇలాంటి చెట్లను ఇప్పటి వరకు ఒక 16 వరకు తయారు చేసి ఆకెన్, కొన్ని షాపింగ్ మాల్స్, కమ్యూనిటీ సెంటర్స్  కు సరఫరా చేశాడట! దానితో వివిధ ప్రాంతాలలో కూడా ఇవి అందరిని ఆకర్షిస్తున్నాయి.

(Visited 511 times, 1 visits today)